అమెరికాలో బాంబుల కలకలం..ఒబామా, క్లింటన్‌పై దాడికి కుట్ర..?

రెండు రోజుల క్రితం యూఎస్ బిలీయనీర్ జార్జ్ సోరోస్ ఇంట్లోనూ ఇలాంటి బాంబే బయటపడింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌కు ఆయన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

news18-telugu
Updated: October 24, 2018, 9:31 PM IST
అమెరికాలో బాంబుల కలకలం..ఒబామా, క్లింటన్‌పై దాడికి కుట్ర..?
క్లింటన్ దంపతులతో ఒబామా (ఫైల్ ఫొటో)
  • Share this:
అమెరికాలో బాంబ్ పార్శిళ్లు తీవ్రకలకం రేపుతున్నాయి. వైట్‌హౌజ్ సహా అమెరికా మాజీ ప్రెసిడెంట్స్ బరాక్ ఒబామా, బిల్ క్లింటన్‌ దంపతులను దుండగులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇళ్లు, కార్యాలయాలకు పేలుడు పదార్థాల పార్శిళ్లను పంపించారు. ఈ కుట్రను సీక్రెట్ సర్వీస్ అధికారులు బుధవారం భగ్నం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా‌, మాజీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరీ క్లింటన్‌ అడ్రస్ మీద పేలుడు పదార్థాల పార్శిల్స్‌ వచ్చినట్లు సీక్రెట్‌ సర్వీసెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా హిల్లరీ ఆఫీస్‌కు వచ్చిన పార్శిల్‌ను తనిఖీ‌ చేయగా ఇవి లభ్యమైనట్లు తెలిపంది. ఈ వ్యవహారంపై యూఎస్‌ ఎఫ్‌బీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

న్యూయార్క్‌ చపాఖ్వాలోని క్లింటన్ నివాసంలో పేలుడు పదార్థాలు దొరికాయి. అంతేకాదు వైట్‌హౌజ్‌కు సైతం ఇలాంటి పేలుడు పదార్థాలే రావడం సంచలనం రేపుతోంది. రెండు రోజుల క్రితం యూఎస్ బిలీయనీర్ జార్జ్ సోరోస్ ఇంట్లోనూ ఇలాంటి బాంబులే బయటపడ్డాయి. బాంబు డిస్పోజల్ టీమ్స్ చేరుకొని వాటిని నిర్వీర్యం చేశాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌కు ఆయన మద్దతు తెలిపారు. ఈ వరుస ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్న FBI అధికారులు..అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

మరోవైపు న్యూయార్క్‌లోని పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలోనూ అనుమానాస్పద వస్తువులను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సీఎన్ఎన్ ఆఫీసు సహా టైమ్ వార్నర్ సెంటర్ భవనాన్ని ఖాళీ చేయించారు. కాగా, బాంబు పార్శిల్స్ వ్యవహారంపై వైట్‌హౌజ్ స్పందించింది. ఒబామా, బిల్‌ క్లింటన్‌‌పై జరిగిన కుట్రను ఖండిస్తున్నట్లు ప్రతినిధి సారా శాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలను సహించేది లేదని..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.First published: October 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు