POTATOES KG COST RS 200 MIRCHI COST RS 710 SRI LANKA IS FACING HUGE FINANCIAL CRISIS AK
బంగాళదుంపలు కేజీ రూ. 200.. పచ్చిమిర్చి కిలో రూ.710.. ఎక్కడో అనుకునేరు.. మన పక్క దేశంలోనే..
ప్రతీకాత్మక చిత్రం
Sri Lanka: శ్రీలంక చాలా ఎక్కువ వడ్డీకి చైనా నుంచి అప్పు తీసుకుంది. అదే ఇప్పుడు ఈ దేశానికి భారంగా మారింది. శ్రీలంక ఈ ఏడాది చైనాకు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్లు తిరిగి ఇవ్వాల్సి ఉంది.
మన పొరుగు దేశమైన శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. తాజాగా శ్రీలంకలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణం ప్రజల జీవనాన్ని కష్టతరం చేసింది. దీంతో ఆ దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీని కింద ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రజలకు ఆహారం, పానీయం అందించేందుకు సైన్యానికి అధికారం కల్పించారు. ఇక్కడ మిర్చి రూ.710, బీన్స్ రూ.320, క్యారెట్ రూ.200, పచ్చి అరటి రూ.120, బెండ రూ.200, టమాట రూ.200కు అమ్ముతున్నారు. శ్రీలంకలో ఆహార పదార్థాల ధరలు నెల రోజుల్లోనే దాదాపు 15 శాతం పెరిగాయి. దేశంలో చాలా వస్తువుల కొరత ఏర్పడింది. దాని ప్రత్యక్ష ప్రభావం సామాన్య జీవితంపై కనిపిస్తోంది. తన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉందని ఓ టాక్సీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అప్పు తీర్చేంత డబ్బు లేకపోవడంతో తిండి తగ్గించుకోవాల్సి వస్తోందని వాపోయాడు. అయితే శ్రీలంక ఈ రకమైన పరిస్థితుల్లోకి జారిపోవడం వెనుక కరోనాతో పాటు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యయం పెరగడం, పన్ను తగ్గింపులు వంటి అంశాలు కూడా ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. చైనా అప్పుల ఊబిలో తీవ్రంగా చిక్కుకున్న శ్రీలంక, రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని, తమకు ఆర్థికంగా సహాయం చేయాలని చైనాను కోరుతోంది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శ్రీలంక పర్యటన సందర్భంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే శ్రీలంక చాలా ఎక్కువ వడ్డీకి చైనా నుంచి అప్పు తీసుకుంది. అదే ఇప్పుడు ఈ దేశానికి భారంగా మారింది. శ్రీలంక ఈ ఏడాది చైనాకు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్లు తిరిగి ఇవ్వాల్సి ఉంది. మరోవైపు శ్రీలంకపై జరుగుతున్న ఆర్థిక దాడిని ఆపాలని శ్రీలంక ఎంపీ ఒకరు చైనా అధ్యక్షుడికి లేఖ రాశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.