గత రెండు సంవత్సరాలుగా విజృంభిస్తున్న కరోనాతో పని పరిస్థితులు మారాయి. ఉద్యోగులకు తమ స్వంత ఇళ్లు కార్యాలయాలుగా మారాయి. దీంతో పాటు వారికి పని గంటల సమయం అంటూ లేకుండా కొన్ని కార్యాలయాలు కొనసాగుతున్నాయి. దీంతో ఉద్యోగులను ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయడం దీంతో వారి వ్యక్తిగత సమయాన్ని కూడా ఆఫీసు పనులకు వాడుకోవడం లాంటీ ఒత్తిడిలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఉద్యోగుల హక్కులు అమలు కాకపోవడంతో పాటు సరైన చట్టలు కూడా లేకపోవడంతో ...వర్క్‌ఫ్రం హోం చేసే వారిపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల హక్కులు కాపాడడంతో పాటు పలు చట్టాలు తీసుకువచ్చేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి కోసం ప్రత్యేక చట్టాలకు పదును పెడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్చను కాపాడడంతో పాటు ఉద్యోగులను ఆకర్షించడం కోసం పోర్చుగల్ ఈ కొత్త చట్టాలను ఆమోదించింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం.. ఉద్యోగి పని గంటల పూర్తయిన తర్వాత కూడా యజమానులు తమ సిబ్బందిని సంప్రదిస్తే అపరాధ రుసుం చెల్లించాల్సిందనని పేర్కోన్నాయి... అలాగే కరోనా కారణంగా కొందరు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇళ్లే తాత్కాలిక కార్యాలయాలుగా మారాయి. దాంతో గ్యాస్, ఇంటర్నెట్, విద్యుత్ వినియోగంతో ఉద్యోగుల ఖర్చులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు సవరించిన చట్టాల ప్రకారం యజమానులు వాటిని కూడా చెల్లించాల్సి ఉంది.
ఇక రానున్న రోజుల్లో కూడా ఉద్యోగుల పిల్లలకు ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు యాజమాన్యం నుంచి అనుమతి పొందకుండానే ఇంటి నుంచి పనిచేసే వెలుసుబాటు కల్పించారు. కాని గత ఏడాది కాలంగా విస్తృతంగా పెరిగిన వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతికి తగ్గట్టుగా ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన బిల్లుల్నింటికి మాత్రం ఆ దేశ పార్లమెంట్లో ఆమోదం దక్కలేదు. పనిగంటలు ముగిసిన తర్వాత తమ పరికరాల్ని డిస్కనెక్ట్ చేసే హక్కును కల్పించే బిల్లుకు కూడా తగిన మద్దతు దక్కలేదు. అయితే ఏది ఏమైనా ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాలు నిలబడి తగిన చట్టాలు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఆహ్వానించతగ్గ అంశాలని ఆ దేవ పౌరులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Work From Home