Dahlia Sky: తుపాకీతో కాల్చుకొని పోర్న్ స్టార్ ఆత్మహత్య.. అంత్యక్రియలకు కూడా డబ్బు లేదు

డాలియా స్కై (Image:Twitter)

Dahlia sky suicide: కొన్నేళ్ల క్రితమే తనకు బ్రెస్ట్ క్యాన్సన్ ఉందన్న విషయం డాలియా స్కైకి తెలిసింది. అప్పటి నుంచీ ఆమె డిప్రెషన్‌లో ఉన్నారు. ఓ ఇళ్లు లేదు. ఆస్తి లేదు. కుటుంబానికి దూరంగా.. చాలా దయనీయ స్థితిలో ఉన్నారని తెలిసిన వాళ్లు అంటున్నారు.

 • Share this:
  అమెరికా పోర్న్ స్టార్ డాలియా స్కై ఆత్మహత్య చేసుకున్నారు. తన కారులోనే.. తుపాకీతో కాల్చుకొని.. బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలిఫొర్నియాలోని లాస్‌ఏంజ్‌లెస్‌లో రెండు వారాల క్రితం ఈ ఘటన జరిగింది. జూన్ 30న శాన్ ఫెర్నాండో వాలీలో ఓ కారులో డాలియా స్కై మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఐతే అక్కడున్న పరిస్థితులను విశ్లేషించిన పోలీసులు.. డాలియా స్కై ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టులోనూ అదే తేలింది. 31 ఏళ్ల డాలియా స్కై  అసలు పేరు మెలిసా సిమ్స్ హేయిస్. 10 ఏళ్లుగా ఆమె పోర్న్ ఇండస్ట్రీలో ఉన్నారు. డాలియా స్కై ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తే.. ఆమె కష్టాల గురించి తెలిసింది.

  డాలియా స్కై బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఆమె మిత్రుడు హన్స్ తెలిపారు. ప్రస్తుతం నాలుగో దశలో వ్యాధి ఉండంతో ఆమె మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఇక తన జీవితం ముగిసిపోయిందని ఎప్పుడూ చింతించేవారు. కొన్నేళ్ల క్రితమే తనకు బ్రెస్ట్ క్యాన్సన్ ఉందన్న విషయం డాలియా స్కైకి తెలిసింది. అప్పటి నుంచీ ఆమె డిప్రెషన్‌లో ఉన్నారు. ఓ ఇళ్లు లేదు. ఆస్తి లేదు. కుటుంబానికి దూరంగా.. చాలా దయనీయ స్థితిలో ఉన్నారని తెలిసిన వాళ్లు అంటున్నారు. కొన్ని రోజులుగా నార్త్‌రిడ్జ్ ప్రాంతంలలో కారులోనే ఆమె నివసిస్తున్నట్లు వెల్లడించారు. చివరకు అదే కారులో ఆత్మహత్య చేసుకొని మరణించారు. దలియా అంత్యక్రియలు, సమాధి నిర్మాణం కోసం ఆమె తల్లి లీసా హెయిస్ gofundme.com ెవెబ్‌సైట్లో 10వేల డాలర్ల‌కు ఫండ్ రైజింగ్ చేశారు. ఇప్పటి వరకు 10,390 డాలర్లు వచ్చాయి.

  డాలియా స్కై 2010లో అడల్ట్ ఎంటరైన్మెంట్‌లోకి అడుగు పెట్టారు. మొదట బెయిలీ బ్లూ పేరిట నిలీ చిత్రాలు చేసేవారు. ఐతే అదే పేరుతో ఉన్న ఓ వస్త్ర కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పేరు మార్చుకున్నారు. అప్పటి నుంచీ డాలియా స్కై పేరుతో అడల్ట్ మూవీల్లో నటిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు అడల్డ్ ఇండస్ట్రీలో ఉన్నా పెద్దగా ఆస్తులు సంపాదించుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. క్యాన్సర్ రావడంతో ఆమె జీవితం ఛిన్నాభిన్నమైందని.. అ డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుందని బాధపడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: