కార్డినల్ హోదాకు ఎంపికైన తొలి నల్లాజాతి అమెరికన్.. ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్

క్యాథలిక్ చర్చిలో కార్డినల్ హోదాను ఎంతో అరుదైన గౌరవంగా భావిస్తారు. అక్టోబరు 25న పోప్ ఫ్రాన్సిస్ ఈ హోదా కోసం 13 మంది జాబితాను ఎంపిక చేశారు.

news18-telugu
Updated: October 26, 2020, 3:13 PM IST
కార్డినల్ హోదాకు ఎంపికైన తొలి నల్లాజాతి అమెరికన్.. ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్
పోప్ ప్రాన్సిస్(ఫైల ఫొటో)
  • Share this:
క్యాథలిక్ చర్చిలో కార్డినల్ హోదాను ఎంతో అరుదైన గౌరవంగా భావిస్తారు. అక్టోబరు 25న పోప్ ఫ్రాన్సిస్ ఈ హోదా కోసం 13 మంది జాబితాను ఎంపిక చేశారు. ఇందులో అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చెందిన ఆర్క్ బిషప్ విల్టన్ గ్రెగరీ ఉన్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి నల్లజాతి అమెరికన్ గా గ్రెగరీ గుర్తింపు తెచ్చుకున్నారు. వాటికన్ సిటీలో సెయింట్ పీటర్ స్క్వేర్ లోని క్యాథలిక్ చర్చి కిటికీ వద్ద నిల్చుని ఈ ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యచకితులను చేశారు పోప్ ఫ్రాన్సిస్. నవంబరు 28న కార్డినల్ హోదా అర్హుల కోసం వేడుకను నిర్వహిస్తారు.

జార్జ్ ఫ్లాయిడ్ కు జరిగిన అన్యాయాన్ని ఖండించారు..

ఈ ఏడాది మేలో మినియాపోలిస్ లో నల్లజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ను నెల్ట్ అనే పోలిసు అధికారి మెడపై కాలువేసి అదిమిన కారణంగా అతడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఎంతో సంచలనాన్ని రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించి అప్పట్లో వార్తల్లో నిలిచారు విల్టన్ గ్రెగరీ. పౌర హక్కుల న్యాయవాదైన గ్రెగరీ ఈ ఘటనపై తన వాదనను బలంగా వినిపించారు. వచ్చే నెలలో కార్డినల్స్ నామకరణం కార్యక్రమం జరిగే సమయానికి గ్రెగరీకి 73 ఏళ్లు నిండుతాయి.

ట్రంప్ పై విమర్శలు..
అంతేకాకుండా ఈ ఏడాది జూన్ లో పోప్ జాన్ పాల్-2ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ చర్చి వద్ద సన్మానించారు. ఈ విషయంపై కూడా తీవ్రంగా స్పందించిన విల్టన్ గ్రెగరీ ట్రంప్ ను దుయ్యబట్టారు. వాషింగ్టన్ చర్చి ముందు పోప్ తో కలిసి ట్రంప్ బైబిల్ పట్టుకుని ఫొటో దిగడాన్ని ఆ మరుసటి రోజు కొంత మంది నిరసించారు. వారిని చెదరగొట్టేందుకు సైనికులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ఉపయోగించాల్సి వచ్చింది.

క్యాథలిక్ నియమాలు తమ మత సూత్రాలను ఉల్లఘించే పద్దతులతో పాటు దుర్వినియోగం చేయడానికి అవకతవకలకు పాల్పడుతున్నాయని విల్టన్ గ్రెగరీ అన్నారు. అందుకే ఖండిస్తున్నాని చెప్పారు. అంతేకాకుండా ఇది ప్రజలందరి హక్కులను కాపాడుకోవాలని చెబుతుందని తెలిపారు. ఈ విషయం గురించి సెయింట్ జాన్ పాల్-2తో కలిసి అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ జాతీయ మందిరానికి రాకముందే ఆయన హెచ్చరించారు.

కార్డినల్ హోదాకు ఎంపికైన సభ్యులు..

అయితే ఈ విషయాలు అటుంచితే దేవుడికి నమ్మకమైన పవిత్రమైన ప్రజలందరి మంచి కోసం నూతన కార్డినల్స్ రోమ్ బిషప్ లో తనకు సహాపడతారని ఆరాధీకులను పోప్ ఫ్రాన్సిస్ కోరారు. అమెరికాలో స్వలింగ జంటల కోసం పౌరసంఘాలకు మద్దతుగా నిలిచినందుకు పోప్ ఫ్రాన్సిస్ వార్తల్లో నిలిచారు. గ్రెగరీ కూడా ఎల్టీబీటీక్యూ న్యాయవాదుల నుంచి మద్దతు అందుకున్నారు.

నూతన కార్డినల్స్ జాబితాలో ఓ ఇటాలియన్ కూడా ఉన్నారు. రానీరో కాంటాలమెస్సా ఫ్రాన్సియన్ ఫ్రైయర్ వాటికన్ సిటీలో చాలా రోజుల నుంచి పాపల్ ప్రీచర్ గా విధును నిర్వరిస్తున్నారు. కిగాలి ర్వాండా నుంచి ఆర్క్ బిషప్ ఆంటోయిన్ కాంబాండా.. ఫిలిప్పైన్స్ క్యాపిజ్ నుంచి ఆర్క్ బిషప్ జోస్ ఫ్యూయర్టె అడ్వెన్కులా, చిలీ శాంటియాగో నుంచి సెలిస్టినో బ్రాకో లాంటి వారు ఉన్నారు.

నవంబరు 28న వాటికన్ సిటీల్లో జరిగే కార్యక్రమాల్లో కార్డినల్స్ వ్యవస్థికృతులవుతారు. రోమన్ క్యాథలిక్ చర్చిలో పోప్ కింద వీరు అత్యంత సీనియర్ మతాధికారులుగా బాధ్యతలు నిర్వరిస్తారు. అంతేకాకుండా పోప్ ను ఎన్నుకునే బాధ్యత కూడా వీరేది. పోప్ క్యాథలిక్ చర్చికి అధిపతి. కాన్ క్లేవ్ అని పిలిచే రహస్య సమావేశంలో ఎంపిక చేస్తారు.
Published by: Sumanth Kanukula
First published: October 26, 2020, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading