ఉంగరాన్ని తాకనివ్వని పోప్ ఫ్రాన్సిస్..సోషల్ మీడియాలో విమర్శలు

పలువురు ఆయన చేతి వేళ్లను ముద్దాడేందుకు ప్రయత్నించారు. ఐతే తన వేలికి ఉన్న ఉంగరానికి భక్తుల పెదాలు తాకకుండా పోప్ ప్రతిఘటించారు. వాళ్లు కిస్ చేస్తున్న సమయంలో చేతిని పదే పదే వెనక్కి తీసుకున్నారు.

news18-telugu
Updated: March 28, 2019, 6:31 PM IST
ఉంగరాన్ని తాకనివ్వని పోప్ ఫ్రాన్సిస్..సోషల్ మీడియాలో విమర్శలు
ఉంగరాన్ని ముద్దాడకుండా చేతిని వెనక్కి తీసుకుంటున్న పోప్ ఫ్రాన్సిస్
news18-telugu
Updated: March 28, 2019, 6:31 PM IST
కేథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఉంగరాన్ని తాకుకుండా కేథలిక్కులను ప్రతిఘటించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోప్ ఫ్రాన్సిస్ తీరును తప్పుబడుతున్నారు నెటిజన్లు. మంగళవారం క్రైస్తవుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన లోరెటా (ఇటలీ)లో పర్యటించారు పోప్ ఫ్రాన్సిస్. ఆ సందర్భంగా స్థానిక చర్చిలో ఆయన్ను కలిసేందుకు చాలా మంది ప్రజలు వచ్చారు. పలువురు ఆయన చేతి వేళ్లను ముద్దాడేందుకు ప్రయత్నించారు. ఐతే తన వేలికి ఉన్న ఉంగరానికి భక్తుల పెదాలు తాకకుండా పోప్ ప్రతిఘటించారు. వాళ్లు కిస్ చేస్తున్న సమయంలో చేతిని పదే పదే వెనక్కి తీసుకున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ తీరుపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు వెనకు తగ్గారు. మరోసారి అలా జరగకుండా జాగ్రతపడ్డారు. ఇటీవల ఆఫ్రికాలో పర్యటించిన పోప్ ఫ్రాన్సిస్.. అక్కడ సామాజిక సేవ చేస్తున్న ఓ నన్‌ను అభినందించారు. ప్రత్యేక మెడల్ బహూకరించి ఆమెను ప్రశంసించారు. ఆ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ చేతిని ఆమె ముద్దాడింది. అప్పుడు పోప్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...