news18-telugu
Updated: November 25, 2020, 5:17 PM IST
ప్రతీకాత్మక చిత్రం
పండ్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. కాయలను ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి తగిన పోషకాలు అందడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అంతేకాకుండా ఎక్సట్రాక్ట్ ఫ్రూట్(పండు సారం) ద్వారా ఇంఫ్లూయెంజా వైరస్, హెర్పస్ వైరస్, పాక్స్ వైరస్, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. ఈ అంశంపై బోస్నియా, హెర్జోగవ్నియాకు చెందిన కొంత పరిశోధకులు అధ్యయనం చేశారు. దానిమ్మ తొక్క సారంపై పరిశోధించి SARS-CoV-2 వైరస్ ను సోకకుండా నివారించవచ్చని కనిపెట్టారు. దానిమ్మలో పాలిఫినాల్స్ ఉండటం వల్ల SARS-CoV-2 వైరస్ ఇంటర్నలైజేషన్ నుంచి నిరోధిస్తుందని జర్నల్ మాలిక్యూలర్ అండ్ సెల్యూక్యూలర్ బయోకెమిస్ట్రీ తాజా సంచికలో ప్రచరించబడింది.
కరోనా వైరస్ చికిత్సకు సహాయపడే మూలికలు, సహజ పదార్థాలను ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు అన్వేషిస్తున్నారు. బోస్నియా, హెర్జెగోవినా బంజాలుకా వర్సిటీలోని ఫార్మాకాగ్నో సీ విభాగం అధ్యాపకులు రెల్జా సురిసిక్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. SARS-CoV-2 ప్రభావాలను నిరోధించే అనేక లక్షణాలను కలిగి ఉండే దానిమ్మ ప్రయోజనాలను అన్వేషించడానికి పరిశోధకులు ప్రయత్నం చేశారు. యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలైన హైపోగ్లైమిక్ లేదా రక్తంలో చక్కెర తగ్గించే ప్రభావాలను తగ్గిస్తుంది.
లిపిడ్ తగ్గించడం లేదా కోలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాలైన యాంటీ హైపర్టెన్సివ్ లేదా రక్తపోటు తగ్గిస్తుంది. యాంటీ మైక్రోబయల్ ఎఫెక్టులను తగ్గిస్తాయి. ఇంఫ్లూయేంజా వైర్, హెర్పెస్ వైరస్, పాక్స్ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ లను నిరోధించడానికి దానిమ్మ సారం ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. వారి అధ్యయనం ద్వారా ప్యూనికాలాగిన్, ప్యూనికాలిన్లు దానిమ్మ సారం ప్రోటీన్ లక్ష్యాలతో సంకర్షణ చెందడంలో గణమీయమైన సామర్థ్యాన్ని చూపుతాయని తద్వారా హోస్ట్ సెల్లోకి వైరల్ ప్రవేశాన్ని నిరోధించవచ్చని చూపించారు. ఈ దానిమ్మ సారం హోస్ట్ సెల్ లోకి వైరల్ ప్రవేశాన్ని నిరోధించిందని పరిశోధకులు తేల్చారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 25, 2020, 5:15 PM IST