ఓ వ్యక్తి కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఇంట్లో అతడు ఒక్కడే ఉంటాడు. రెండు రోజులుగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అతడి ఇంటికి చేరుకున్నారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా ఎవరూ రాలేదు. కనీసం స్పందించలేదు. చివరకు పోలీసులే ఇంటి తలుపులు బద్దలు కొట్టి.. లోపలికి వెళ్లారు. ఇంటికి లోపల వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. అక్కడ ఆ వ్యక్తి మృతదేహం కనించింది. దాని చుట్టూ వందకు పైగా పాములు పాకుతూ ఉన్నాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్‌లో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? అతడు ఎలా మరణించాడు? పాములు ఎక్కడి నుంచి వచ్చాయి?
మేరీలాండ్‌లోని చార్లెస్ కౌంటీ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. రెండు రోజులు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి.. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లి.. తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ సదరు వ్యక్తి మృతదేహం కనిపించింది. నేలపై పడి ఉంది. ఆ డెడ్ బాడీ చుట్టూ ఏకంగా 125 పాములు కనిపించాయి. శరీరంపై అటూ ఇటూ పాకుతున్నాయి. ఆ పాముల్లో అత్యంత విషపూరితమైన కోబ్రాతో పాటు 14 అడుగుల కొండ చిలువ కూడా ఉంది.
ఐతే మరణించిన ఆ వ్యక్తి సీక్రెట్‌గా ఇంట్లోనే పాములు పెంచుతున్నట్లు సమాచారం. ఒక్కటి కాదు రెండు ఏకంగా 125 పాములు కనిపించడంతో చుట్టుపక్కల భయంతో వణికిపోయారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. మరి అతడు ఎలా మరణించాడు? పాములే కాటు వేశాయా? ఏదైనా వ్యాధితో చనిపోయాడా? లేదంటే ఎవరైనా కుట్రచేసి చంపేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ఇంటి నుంచి ఇప్పటికే కొన్ని పాములు తప్పించుకుపోయాయేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై చార్లెస్ కౌంటీ యానిమల్ కంట్రోల్ ప్రతినిధి జెన్నిఫర్ హారిస్ స్పందించారు. ఇంట్లోని పాముల్లో ఏవి కూడా తప్పించుకుపోయే అవకాశం లేదని.. అన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని స్పష్టంచేశారు. ప్రజలు ఏ మాత్రం యపడాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. జనావాసాల్లోకి పాములు రావడం సహజమే.. కానీ అతడి ఇంట్లో ఏకంగా 125 పాములు కనిపించడం.. హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.