Bangladesh: బంగ్లాదేశ్​ అల్లర్ల కేసును చేధించిన పోలీసులు.. ఖురాన్​ను మందిరంలో పెట్టిన వ్యక్తి అరెస్టు

ఫైల్​

బంగ్లాదేశ్ పోలీసులు కొమిల్లా పట్టణంలోని మండపం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో మందిరంలో ఖురాన్ ఉంచిన వ్యక్తిని గుర్తించారు. ఆ పని చేసింది నగరంలోని సుజానగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ హుస్సేన్ (35) గా గుర్తించారు.

  • Share this:
    బంగ్లాదేశ్‌ (Bangladesh). గత వారం రోజులుగా అల్లర్లతో అట్టుడికింది. దేవాలయాల (Temples)పై, హిందువుల (Hindus) పై దాడులు పెరిగాయి. అక్టోబర్ 13 న అక్కడి కొమిల్లా పట్టణం నుంచి ప్రారంభమైన హిందువులపై దాడులు బంగ్లాదేశ్ అంతటా అక్టోబర్ 17 వరకు కొనసాగాయి. ఈ సమయంలో హింస దారుణంగా జరిగింది. దుర్గా మండపాలను కూల్చివేశారు. హిందువుల ఇళ్లు కాలిపోయాయి. హిందువులపై దాడి జరిగింది. ఈ హింస ఇంకా పూర్తిగా ఆగలేదు. అయితే ఈ దుర్గా పూజా మండపాలలో విగ్రహాల మధ్య ఖురాన్ (Quran) ఉంచడం ద్వారా హిందువులపై దాడుల కుట్రను పోలీసులు ఛేదించారు. బంగ్లాదేశ్ పోలీసులు కొమిల్లా పట్టణంలోని మండపం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో మందిరంలో ఖురాన్ ఉంచిన వ్యక్తిని గుర్తించారు. ఆ పని చేసింది నగరంలోని సుజానగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ హుస్సేన్ (35) గా గుర్తించారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. హుస్సేన్‌కు మద్దతు ఇచ్చిన ఇద్దరు సహచరులను కూడా పోలీసులు గుర్తించారు. వారి పేర్లు ఫయాజ్, ఇక్రమ్ హుస్సేన్ అని పోలీసులు తెలిపారు. వారిద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

    41 మంది..

    ఇప్పటివరకు మొత్తం 41 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఫయాజ్, ఇక్రమ్‌తో సహా నలుగురు వ్యక్తులు హుస్సేన్ సహచరులుగా తెలిసింది. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పోలీసులను ఆదేశించారు.

    తాలిబన్ల లాగా..

    ఢాకా వాచర్స్ కథనం ప్రకారం.. షేక్ హసీనా ప్రభుత్వంపై జమాతే-ఇ-ఇస్లామీ బంగ్లాదేశ్ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని అధికార పార్టీ నమ్ముతోంది. దీనిని నిర్ధారించుకోవడం కోసం ఇంకా ఆధారాలు సేకరిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో తాలిబన్ లాగా పూర్తి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే జమాత్ లక్ష్యం. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం , మసీదు నుండి దుర్గా మండపం వరకు ఖురాన్ తీసుకువెళుతున్న దృశ్యాలు ననువా దిగిర్‌లోని పూజ పండల్ చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలో లభించాయి. అందులో పూర్తిగా ఇక్బాల్ హుస్సేన్ కనిపించాడు. ఒక ఫుటేజ్‌లో అతను స్థానిక మసీదు నుంచి ఆకుపచ్చ వస్త్రంతో కప్పబడిన ఖురాన్‌తో బయలుదేరిన తర్వాత పూజ మండపాల్లోకి ప్రవేశించడం కనిపిస్తుంది. దీని తరువాత అతను హనుమంతుని విగ్రహం దగ్గర నడుస్తూ కనిపించాడు. హుస్సేన్‌ను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.

    మందిరంలోకి వచ్చి..

    మీడియా నివేదిక ప్రకారం.. పోలీసులు మొత్తం కుట్రపై సమగ్ర దర్యాప్తు చేశారు. హుస్సేన్ ఖురాన్‌ను మండపంలో ఉంచాడని ఒక పోలీసు అధికారి చెప్పారు. దీని తరువాత ఫయాజ్ తన కమ్యూనిటీకి చెందిన ప్రజలను అక్కడ ప్రేరేపించాడు. ఈక్రమ్ 999 అత్యవసర సేవకు కాల్ చేసి, పూజ మండపంలోని ఖురాన్ ఉనికి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ననువా దిగిర్ పూజ వేడుకల కమిటీ అధ్యక్షుడు సుబోధ్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. మేం పవిత్ర ఖురాన్ చూడలేదు. అకస్మాత్తుగా ఇద్దరు యువకులు వచ్చి.. వెంటనే  “పూజా మండపంలో ఖురాన్ కనిపించింది.. పూజ మండపంలో ఖురాన్​ కనిపించింది..” అని అరవడం ప్రారంభించారు. ఆ తర్వాత గొడవ మొదలైంది అని చెప్పారు.

    ఫయాజ్ ఫేస్‌బుక్ లైవ్ చేశాడు..

    ఫయాజ్ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో చేశాడు. దీనిలో అతను ఈ మొత్తం సంఘటన వివరాలను చాలా రెచ్చగొట్టే విధంగా చెప్పాడు. ఈ వీడియో తర్వాత బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో కూడా పూజల మండపాలు, హిందువుల ఇళ్లపై దాడుల సంఘటనలు ప్రారంభమయ్యాయి.

    బంగ్లాదేశ్‌లో ముద్రించబడలేదు..

    పోలీసు అధికారి కూడా కోమిల్లాలోని పూజ మండపం లోపల వినాయకుని పాదాల కింద ఉన్న ఆకుపచ్చ వస్త్రంతో చుట్టబడిన ఖురాన్ బంగ్లాదేశ్‌లో ముద్రించబడలేదని చెప్పాడు. ఫయాజ్ సౌదీ అరేబియాలో ముద్రించిన ఈ ఖురాన్ తెచ్చాడు. అదేవిధంగా అది అతని వ్యక్తిగత ఖురాన్. పోలీసు అధికారి ప్రకారం, ఫయాజ్ గత సంవత్సరం సౌదీ అరేబియా నుండి బంగ్లాదేశ్‌కు వచ్చాడు. కొమిల్లాలో మొబైల్ సేవా దుకాణాన్ని ప్రారంభించాడు. ఖురాన్ సౌదీ అరేబియా నుండి వచ్చినందున దీనిని కుట్రలో భాగంగా పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published: