తలస్నానం చేసి అలా బయటకు వెళ్లింది.. అంతే.. ఆతర్వాత

రోడ్లన్నీ మంచుతో కూరుకుపోయాయి. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలెవరు బయటకు రావద్దని సూచిస్తున్నారు అక్కడి అధికారులు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 2, 2019, 4:10 PM IST
తలస్నానం చేసి అలా బయటకు వెళ్లింది.. అంతే.. ఆతర్వాత
ఫ్రీజ్ అవుతున్న తడిజుట్టు
  • Share this:
అమెరికాలో చలి విపరీతంగా పెరిగిపోయింది. ప్రమాదకరస్థాయిలో మైనస్ 50 డిగ్రీలుగా ఉంది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఆర్కిటిక్ నుంచి కూడా చల్లటి చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. రోడ్లన్నీ మంచుతో కూరుకుపోయాయి. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలెవరు బయటకు రావద్దని సూచిస్తున్నారు అక్కడి అధికారులు.

తాజాగా అక్కడి నయాగరా జలపాతం కూడా గడ్డకట్టుకుపోయింది. అమెరికాలో గత 50ఏళ్లలో ఎప్పుడూ ఇంతలా చల్లటి వాతావరణం లేదు. ఇటీవల కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన హిమపాతమని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఓ అమ్మాయి తలకు స్నానం చేసి తడిజుట్టుతో బయటకు వెళ్లగానే ఆమె హెయిర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. దీన్ని బట్టి అక్కడ ఉష్ణోగ్రత ఎంత తక్కువ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోలో అమ్మాయి పోస్టు చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది.

మరోవైపు అమెరికాలో చాలా ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది కోట్ల మంది ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు -20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో జీవిస్తున్నారని అమెరికా జాతీయ వాతారణ సేవల సంస్థ వెల్లడించింది.


First published: February 2, 2019, 3:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading