news18-telugu
Updated: November 27, 2020, 8:36 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కేవలం ఆరు రోజుల్లో 9 లక్షల కోళ్లను కోసేస్తున్నారు. ఇది కరోనా సమయం కదా. చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఏ కోళ్ల ఫారం యజమానులో చికెన్ ఫెస్టివల్ కోసం ఇలా చేయడం లేదు. బర్డ్ ఫ్లూ కారణంగా ఈ పని చేస్తున్నారు. అయితే, ఇది మన దగ్గర కాదు. పోలాండ్‌లో. పోలాండ్లోని రోనియావీ ప్రాంతంలో H5N8 బర్డ్ ఫ్లూ విజృంభించింది. దీంతో అక్కడ కోళ్ల ఫాంలలో ఉన్న 9,30,000 కోళ్లను సమాధి చేసేయాలని అధికారులు నిర్ణయించినట్టు పోలండ్‌లో స్థానిక వార్తా సంస్థ పీఏపీ తెలిపింది. ‘ఆ కోళ్ల ఫారాల్లో 9,30,000 కోళ్లు ఉన్నాయి. ఆ కోళ్ల ఫాం వెనుక కాలువ ఉంది. పంట పొలాలు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని అడవి పక్షులు కూడా ఉన్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా కోళ్లను చంపేయాలని నిర్ణయించాం. గురువారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఆరు రోజుల పాటు ఈ వధ కొనసాగుతుంది.’ అని స్థానిక వెటర్నరీ వైద్యులను ఉటంకిస్తూ పీఏపీ వార్తా సంస్థ తెలిపింది. ఇప్పటికే అక్కడ వరుసగా ఫ్లూలు విజృంభిస్తున్నాయి. దీని వల్ల మనుషులకు అంత భారీ ప్రమాదం లేదని తెలిసినా, ముందస్తు జాగ్రత్తగా అధికారులు కోళ్లను సమాధి చేయాలని నిర్ణయించారు. అయితే, దీనిపై స్పందించేందుకు పోలండ్ చీఫ్ వెటర్నరీ ఇన్స్పెక్టర్ అందుబాటులోకి రాలేదని ఆ సంస్థ పేర్కొంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 27, 2020, 8:32 PM IST