Tunisian President- Kais Saied: ట్యునీషియా అధ్యక్షుడి టేబుల్ పై విషపు లేఖ.. సైలెంట్ గా చంపేందుకు మాస్టర్ ప్లాన్.. చివరకు..

ట్యునీషియా అధ్యక్షుడు కైస్ సయీద్ (Photo Courtesy: Phot Palestinian Return Centre)

ఓ దేశాధ్యక్షుడినే చంపేందుకు కుట్ర జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ కుట్రదారులు కూడా సాంకేతికతను తెగ వాడేశారు. విషం పూసిన ఓ లేఖ ద్వారా అధ్యక్షుడిని చంపేందుకు యత్నించారు. ఆయన టేబుల్ వద్దకు ఆ లేఖ కూడా చేరింది.. కానీ..

  • Share this:
    దేశ ప్రధానులు, అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని గతంలో ఎన్నో దారుణాలు జరిగాయి. వ్యక్తిగత సహాయకులే కాల్పులకు తెగబడి చంపేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ దేశాధ్యక్షుడినే చంపేందుకు కుట్ర జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ కుట్రదారులు కూడా సాంకేతికతను తెగ వాడేశారు. విషం పూసిన ఓ లేఖ ద్వారా అధ్యక్షుడిని చంపేందుకు యత్నించారు. ఆ లేఖను చదివే క్రమంలో చేతులతో పట్టుకుంటే, శరీరంలోకి కూడా వెళ్తుందని, తద్వారా అధ్యక్షుడిని అంతమొందించొచ్చని దుండగులు భావించారు. అయితే ఆ లేఖను అధ్యక్షుడు కాకుండా, ఆ దేశాధ్యక్షుడి వ్యక్తిగత సహాయకురాలు తెరవడం వల్ల ఆయనకు పెను ప్రమాదం తప్పింది. వ్యక్తిగత సహాయకురాలు ఆసుపత్రి పాలయింది. ట్యునీషియా దేశంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ట్యునీషియా దేశానికి కైస్ సయీద్ అధ్యక్షుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన్ను అంతం చేయాలని కొందరు దుండగులు భారీ కుట్రకు తెరలేపారు. విషంతో కూడిన ఓ లేఖను తయారు చేశారు. దాన్ని అతి జాగ్రత్తగా దేశాధ్యక్షుడి భవనం వద్దకు చేర్చారు. సోమవారం ఆ లేఖ దేశాధ్యక్షుడి భవనానికి చేరింది. రోజూ లాగానే ఈ గురువారం కూడా దేశాధ్యక్షుడికి వచ్చిన లేఖలను ఆయన వ్యక్తిగత సహాయకురాలు నదియా అకాచ ఓ క్రమంలో ఉంచింది. ఆ లేఖలను చదవి, ముఖ్యమైన విషయాలను అధ్యక్షుడికి చెప్పడం అమె విధి. అంతకుముందే అధ్యక్షుడికి చేరిన ఆ విషపు లేఖను కూడా చదవాలని తెరిచింది. అందులో విషయం ఏమీ లేకపోగా, దాన్ని తెరచిన వెంటనే ఆమె ఉన్నట్టుండి కింద పడిపోయింది.

    దీంతో అధ్యక్ష భవనంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లేఖ వల్లే ఆమె స్పృహ కోల్పోయారని గ్రహించారు. వెంటనే నిపుణులను రప్పించి ఆ లేఖను జాగ్రత్తగా తీయించారు. అదే సమయంలో నదియా అకాచన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ట్యూనీషియా దేశంలో తీవ్ర కలకలం రేపింది. దీంతో దేశాధ్యక్షుడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కైస్ సయీద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ’విషంతో కూడిన ఓ లేఖ మా భవనానికి వచ్చింది. అదృష్ట వశాత్తు నాకు ఈ ఘటనలో ఏమీ కాలేదు. ఎవరూ కంగారు పడొద్దు. ప్రమాదం బారిన పడిన నా వ్యక్తిగత సహాయకురాలు కూడా అత్యంత వేగంగా కోలుకుంటున్నారు‘ అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దేశ భద్రతా దళాలు ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై ఆరా తీస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: