నవాజ్‌ షరీఫ్‌ భార్య మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం


Updated: September 12, 2018, 5:13 AM IST
నవాజ్‌ షరీఫ్‌ భార్య మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
ప్రధాని మోదీ..
  • Share this:
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య బేగం కుల్‌సుమ్‌ షరీఫ్‌ మృతి చెందారు. గత కొద్దీ కాలంగా క్యాన్సర్ బాధపడుతున్న ఆమె 2014 జూన్ నుండి లండన్ లో చికిత్స పొందుతున్నారు. 2017లో ఆమెకు గొంతు క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. మంగళవారం ఆమె ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కృతిమ శ్వాస అధించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆమె మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ కు ఓ లేఖ ద్వారా తన సంతాపాన్ని తెలిపారని పాక్ మీడియా చెప్తోంది.

1950లో పాకిస్తాన్‌లో జన్మించిన కుల్‌సుమ్‌ 1971లో నవాజ్‌ షరీఫ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నవాజ్‌ షరీఫ్‌, ఆమె కుమార్తె మరియమ్‌ రావాల్పిండిలోని అదిలా జైల్‌లో అక్రమ ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె మృతికి పలువురు పాకిస్తాన్‌ జాతీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

First published: September 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>