కాసేపట్లో ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం

దేశంలో పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మోదీ కేర్, ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలపై ప్రధాని మోదీ ఐరాసలో వివరిస్తారు.

news18-telugu
Updated: September 27, 2019, 7:07 PM IST
కాసేపట్లో ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం
ఐరాసలో ప్రధాని మోదీ (File: AP Photo/Seth Wenig)
news18-telugu
Updated: September 27, 2019, 7:07 PM IST
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. 74వ ఐరాస సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్ కానుంది. న్యూయార్క్‌లోని ఐరాస కేంద్ర కార్యాలయంలో రాత్రి 8-9 గంటల మధ్య (భారతీయ కాలమానం) నరేంద్ర మోదీ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. 2014లో తొలిసారి ఐరాసలో ప్రసంగించారు మోదీ. ఇవాళ రెండోసారి ప్రసంగించనున్నారు. నేడు ఐరాసలో ప్రసంగించేవారి జాబితాలో నరేంద్ర మోదీ నాలుగో స్థానంలో ఉన్నారు. మోదీ తర్వాత కొద్దిసేపటికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తారు. ఐరాస 74వ సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతున్నాయి. దేశంలో పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మోదీ కేర్, ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలపై ప్రధాని మోదీ ఐరాసలో వివరిస్తారు. పాకిస్తాన్ గడ్డ మీద నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని కూడా ప్రధాని ఐరాస సాక్షిగా హైలైట్ చేయనున్నారు.


జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత దీనిపై పాకిస్తాన్ రాద్ధాంతం చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్ ఏదో తప్పు చేసినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందే దీటుగా సమాధానం చెప్పడానికి ప్రధాన మోదీ ఈ సమావేశాన్ని అద్భుతంగా వినియోగించుకోనున్నారు.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...