ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్.. 20 నిమిషాల్లో టాప్ 10 పాయింట్లు..

PM Modi UN Speech |మొదట గాంధీని గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి, మధ్యలో ఓ తమిళకవి గురించి ప్రస్తావించారు. చివర్లో స్వామి వివేకానంద సందేశంతో ముగించారు.

news18-telugu
Updated: September 27, 2019, 10:34 PM IST
ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్.. 20 నిమిషాల్లో టాప్ 10 పాయింట్లు..
Video : నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతి : ప్రధాని మోదీ
 • Share this:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. న్యూయార్క్‌లో జరిగిన 74వ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. ఐరాస అధ్యక్షుడు మోదీ మాట్లాడతారని చెప్పగానే సభలో చప్పట్లు మారుమోగాయి. మొదట గాంధీని గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి, మధ్యలో ఓ తమిళకవి గురించి ప్రస్తావించారు. చివర్లో స్వామి వివేకానంద సందేశంతో ముగించారు.
  1. ప్రధాని నరేంద్ర మోదీ హిందీలో మాట్లాడారు. 20 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది.

  2. పాకిస్తాన్ పేరు ఎత్తకుండా ఉగ్రవాదంపై మాట్లాడారు. ఉగ్రవాదం అనేది భారత్‌కు మాత్రమే కాదని, ప్రపంచ మానవాళికి ప్రమాదమని హెచ్చరించారు.

  3. ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజారోగ్య పథకం ఆయుష్మాన్ భారత్‌ను తీసుకొచ్చాం. దీని వల్ల 50 కోట్ల మందికి లబ్ధి
  4. ప్రపంచంలోనే అతి పెద్దగా స్వచ్ఛ భారత్ చేపట్టాం. ఐదేళ్లలో 110 మిలియన్ల టాయిలెట్లు నిర్మించాం.

  5. ప్రపంచంలోనే అత్యంత భారీగా 370 మిలియన్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాం

  6. ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ గుర్తింపు (బయోమెట్రిక్) తీసుకురావడం ద్వారా 20 బిలియన్ డాలర్ల అవినీతిని అరికట్టగలిగాం

  7. వచ్చే ఐదేళ్లలో 150 మిలియన్ నివాసాలకు మంచినీరు

  8. 2025 నాటికి 125 మిలియన్ కిలోమీటర్ల రహదారుల నిర్మాణం

  9. 2025 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యం

  10. భారత్‌లో కూడా ఒకసారి వాడే ప్లాస్టిక్‌‌పై నిషేధం

  11. భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనేనాటికి 20 మిలియన్ల ఇళ్ల నిర్మాణం

  12. 450 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధనం లక్ష్యం
First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading