#HowdyModi | తొమ్మిది భాషల్లో మాట్లాడిన మోదీ.. ట్రంప్ ఆశ్చర్యం

#HowdyModi | భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్న ప్రధాని మోదీ.. దేశంలో ఎన్నో భాషలు, యాసలు ఉన్నాయన్నారు.

news18-telugu
Updated: September 23, 2019, 9:08 AM IST
#HowdyModi | తొమ్మిది భాషల్లో మాట్లాడిన మోదీ.. ట్రంప్ ఆశ్చర్యం
హూస్టన్‌లో జరిగిన #HowdyModi ఈవెంట్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
  • Share this:
భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది భారతీయ భాషల్లో మాట్లాడారు. ఆయన పలికింది చిన్న పదాలే అయినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హూస్టన్ మెగా ఈవెంట్‌కు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. అమెరికాలోని హూస్టన్‌లో ఉన్న ఎన్‌ఆర్జీ స్టేడియంలో #HowdyModi మెగా ఈవెంట్ నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధానికి స్థానిక ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. అమెరికా నలుమూలల నుంచి సుమారు 50వేలకు పైగా భారతీయులు, అమెరికన్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర మోదీ తొమ్మిది భాషల్లో మాట్లాడారు. ‘అంతా బాగుంది’ అనే పదాన్ని హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, తెలుగు,కన్నడ, తమిళంతోపాటు మరో భాషలో పలికారు. తాను అన్ని భాషల్లో ఏం చెప్పానో మళ్లీ ట్రంప్‌కు వివరించారు ప్రధాని మోదీ. దీంతో అక్కడున్నవారిలో నవ్వులు విరిశాయి. భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్న ప్రధాని మోదీ.. దేశంలో ఎన్నో భాషలు, యాసలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా, భిన్నరకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వేషభాషలు, వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు తెలిపారు. అలా ఉండడమే భరతగడ్డ అద్భుతం అని చెప్పారు.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading