• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • PM NARENDRA MODI PRONOUNCE HYDERABAD NAME IN HOWDY MODI HOUSTON DONALD TRUMP BA

#HowdyModi | ప్రధాని మోదీ హూస్టన్ ప్రసంగంలో హైదరాబాద్

#HowdyModi | ప్రధాని మోదీ హూస్టన్ ప్రసంగంలో హైదరాబాద్

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

‘2017లో మీరు నన్ను మీ కుటుంబానికి పరిచయం చేశారు. ఈ రోజు నేను మిమ్మల్ని మా కుటుంబానికి (భారతీయ) పరిచయం చేస్తున్నా.’ అని నరేంద్ర మోదీ అన్నారు.

  • Share this:
    ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలోని హూస్టన్‌లో చేసిన ప్రసంగంలో హైదరాబాద్ పేరును ప్రస్తావించారు. #HowdyModi పేరుతో టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఉన్న ఎన్ఆర్జీ స్టేడియంలో మెగా ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 48 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు సుమారు 50వేల మంది వరకు ఈ మెగా ఈవెంట్‌కు తరలివచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా మధ్య ఉన్న సత్సంబంధాలను ప్రస్తావిస్తూ.. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. మోదీ మాట్లాడుతూ... ‘హూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు, బోస్టన్ నుంచి బెంగళూరు వరకు, చికాగో నుంచి సిమ్లా వరకు, లాస్ ఎంజిలెస్ నుంచి లూథియానా వరకు, న్యూజెర్సీ నుంచి న్యూ ఢిల్లీ వరకు.. కోట్లాది మంది ప్రజలు ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని టీవీలో వీక్షిస్తున్నారు. చరిత్ర వారి కళ్లకు కనిపిస్తోంది.’ అని మోదీ అన్నారు.

    ‘2017లో మీరు నన్ను మీ కుటుంబానికి పరిచయం చేశారు. ఈ రోజు నేను మిమ్మల్ని మా కుటుంబానికి (భారతీయ) పరిచయం చేస్తున్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నా స్నేహితుడు. భారత్‌కు ఆప్తమిత్రుడు.’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన హూస్టన్ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం ట్రంప్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఇద్దరూ కలసి స్టేజ్ అంచు వరకు వెళ్లారు. అక్కడి నుంచి మెట్లు దిగి మోదీ వెళ్లి ముందు వరసలో కూర్చోగా, ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
    First published:

    అగ్ర కథనాలు