PM modi on Global citizen live: ‘‘దేశంలో ప్రతీ ఇంటికీ తాగునీటి కనెక్షన్లే లక్ష్యంగా పని చేస్తున్నాం” ప్రధాని మోదీ

ప్రధాని మోదీ (Photo: ANI / Twitter)

ఐక్యరాజ్య సమితి జనరల్​ అసెంబ్లీలో ప్రసంగించిన అనంతరం మోదీ గ్లోబల్​ సిటిజన్​ లైవ్​లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా వారియర్స్​ను మోదీ అభినందించారు. శాస్త్రవేత్తల స్పూర్తిని కొనియాడారు. మన విధానాలను తరతరాలు గుర్తుంచుకుంటాయని మోదీ ఈ సందర్భంగా మానవాళికి పిలుపునిచ్చారు.

  • Share this:
    కలసి ఉంటే మరింత బలంగా ఉంటామని గత రెండేళ్లలో నేర్చుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi) అన్నారు. ఐక్యరాజ్య సమితి (United nations) జనరల్​ అసెంబ్లీలో ప్రసంగించిన అనంతరం మోదీ గ్లోబల్​ సిటిజన్​ లైవ్ (Global citizen live)​లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా వారియర్స్​ను మోదీ అభినందించారు. శాస్త్రవేత్తల స్పూర్తిని కొనియాడారు. మన విధానాలను తరతరాలు గుర్తుంచుకుంటాయని మోదీ ఈ సందర్భంగా మానవాళికి పిలుపునిచ్చారు.  భారతదేశంలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్లు ( drinking water connections to every household) అందించడం లక్ష్యంగా సాగుతున్నట్లు మోదీ తెలిపారు. తదుపరి తరం మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    స్పూర్తి చూశాం..

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ లో ప్రసంగిస్తూ .. కోవిడ్​ వారియర్స్ (Covid warriors)​, వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది మహమ్మారిపై పోరాడటంలో తమ వంతు కృషి చేసినప్పుడు మేం ఈ సామూహిక స్ఫూర్తిని చూశాం. రికార్డు సమయంలో కొత్త టీకాలను (vaccines) సృష్టించిన మన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలలో ఈ స్ఫూర్తిని చూశాం".



    "రెండు సంవత్సరాలుగా (two years onwards) మానవాళి జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనటువంటి  మహమ్మారితో ప్రపంచం పోరాడుతోంది. మహమ్మారిపై పోరాడిన అనుభవం మనం కలిసి ఉన్నప్పుడు మరింత బలంగా, మెరుగ్గా ఉంటుందని నేర్పింది” అన్నారు  మోదీ.



    నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ..

    వీటిలో భాగంగా మిలియన్ల మందికి సామాజిక భద్రతా కవరేజ్ అందించడం (social security coverage to millions), 500 మిలియన్ల మంది భారతీయులకు ఉచిత, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ (free & quality healthcare to 500 million Indians) అందించడం ఉన్నాయి. సుమారు 30 మిలియన్ల ఇళ్లు నిర్మించినందకు మీరు ఇపుడు సంతోషంగా ఉన్నారని మోదీ వెల్లడించారు.



    గత సంవత్సరం నుంచి దాదాపు దేశంలోని 800 మిలియన్ల  (Millions) మందిపౌరులకు ఉచిత ఆహార ధాన్యాలు అందించబడ్డాయి. ఇలాంటి ఇతర ప్రయత్నాలు పేదరికానికి (poverty) వ్యతిరేకంగా పోరాటం చేయడానికి బలాన్ని ఇస్తాయి. విశ్వసనీయ భాగస్వాములు పేదరికం  విష వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వారికి అందిస్తారు. పేదలను శక్తివంతం చేయడానికి శక్తిని ఉపయోగించినప్పుడు, వారు పేదరికంతో పోరాడే శక్తిని పొందుతారు” అని మోదీ అన్నారు.


    ‘‘ఇక వాతావరణ మార్పుల ముప్పు మన ముందు పొంచి ఉంది. ప్రపంచ వాతావరణంలో ఏదైనా మార్పు మొదట మనతోనే ప్రారంభమవుతుందని ప్రపంచం అంగీకరించాలి. వాతావరణ మార్పులను తగ్గించడానికి సరళమైన, అత్యంత విజయవంతమైన మార్గం ప్రకృతికి అనుగుణంగా ఉండే జీవనశైలిని నడిపించడం మాత్రమే. పారిస్​ ఒప్పందం ప్రకారం మొత్తం G 20 దేశాలలో భారత్​ మాత్రమే నిబద్దతతో ఉంది ”అని మోదీ అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published: