PM US Tour : అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ... ట్రంప్‌తో భేటీ

PM Modi USA Tour : ఈసారి ఎప్పుడూ లేనిది ప్రధాని మోదీ పర్యటనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా అమెరికన్లంతా భారత్, అమెరికా సంబంధాలపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 21, 2019, 6:03 AM IST
PM US Tour : అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ... ట్రంప్‌తో భేటీ
మోదీ, ట్రంప్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: September 21, 2019, 6:03 AM IST
PM Modi USA Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... నేటి నుంచీ 27 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధానంగా టెక్సాస్‌ రాష్ట్రంలోని హోస్టన్,... న్యూయార్క్‌లో ఆయన పర్యటనలు సాగనున్నాయి. నేడు ఢిల్లీ నుంచీ బయలుదేరే మోదీ... ముందుగా హోస్టన్ వెళ్తారు. అక్కడి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతారు. అదే సమయంలో కొందరు కొందరు డెమొక్రటిక్ నేతలతో కలిసి మోదీ ప్రసంగిస్తారు. ఆదివారం ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోదీ పాల్గొని, ప్రసంగిస్తారు. ఆరోగ్యం, టెర్రరిజంపైనా మోదీ మాట్లాడతారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును ఎండగట్టే అవకాశాలున్నాయి. తర్వాత మోదీ NRG స్టేడియంలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన చరిత్రాత్మక సదస్సులో పాల్గొంటారు. అమెరికా టైమ్ ప్రకారం 22న ఉదయం 10.45 గంటలకు ఇది జరగనుంది. ఆ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తున్నారు. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొనే సభకు అమెరికా అధ్యక్షుడు రాబోతుండటం ఇదే మొదటిసారి. అనేక మంది కాంగ్రెస్‌ సభ్యులు, మేయర్లు, అమెరికన్‌ ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా 90 నిమిషాలపాటూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. వీటిలో 400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు.

Loading...
ఎన్నారైల సదస్సు తర్వాత 24న ఐరాస సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు మోదీ వెళ్తారు. అలాగే... అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా... ఐరాసలో 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అదే సందర్భంలో పారిశ్రామిక వేత్తలు, భారత ప్రతినిధి బృందంతో మోదీ మాట్లాడతారు. ఆ తర్వాత 27న తిరిగి భారత్ వస్తారు.


మోదీ అమెరికా టూర్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రధానంగా ట్రంప్‌తో మోదీ ఈ ఏడాది మూడోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకుముందు జపాన్‌లో జరిగిన జీ20 సదస్సులో, ఆ తర్వాత ఆగస్ట్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో వాళ్లిద్దరూ కలిశారు. 22న జరిగే హౌడీ-మోడీ ఎన్నారైల సదస్సులో ట్రంప్... ప్రవాస భారతీయులను ఉద్దేశించి... కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని తెలిసింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్న ట్రంప్... ఎన్నారై సదస్సును అందుకు వేదికగా చేసుకోబుతున్నారని తెలిసింది.


జోరుగా వర్షాలు : ఎన్నారైలతో తలపెట్టిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తవుతున్నా... హోస్టన్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు రోడ్లపైనే ఉంది. టెక్సాస్‌ రాష్ట గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ 13 కౌంటీలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దక్షిణ టెక్సాస్‌లో ప్రజలను బయటికి రావొద్దని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం హౌడీ-మోదీ సభ జరిగే NRG స్టేడియం కూడా వాన నీటితో నిండిపోయింది. దాదాపు 1,500 మంది వాలంటీర్లు సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం నాటికి సాధారణ పరిస్థితులు ఉంటాయంటున్నారు.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...