ఫ్లైట్ రూట్ ఛేంజ్.. పాకిస్తాన్ కాదు.. మరో మార్గంలో మోదీ ప్రయాణం

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పాల్గొనేందుకు గతంలో పాకిస్తాన్ గగనతలంలో పయనించాలనుకున్నారు. ఇప్పుడు ఒమన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల గగనతలాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు.

news18-telugu
Updated: June 12, 2019, 3:48 PM IST
ఫ్లైట్ రూట్ ఛేంజ్.. పాకిస్తాన్ కాదు.. మరో మార్గంలో మోదీ ప్రయాణం
ప్రధాని మోదీ (File)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ మనసు మార్చుకున్నారు. కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పాల్గొనేందుకు గతంలో పాకిస్తాన్ గగనతలంలో పయనించాలనుకున్నారు. ఇప్పుడు ఒమన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల గగనతలాన్ని వినియోగించుకోవాలని.. ఆ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. 11 వాయుమార్గాల్లో కేవలం రెండు మార్గాల ద్వారానే అనుమతిస్తోంది. అయితే, మోదీ కిర్గిస్తాన్ పర్యటన కోసం పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. అందుకు పాకిస్తాన్ కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ గగనతలంలో కాకుండా మరో మార్గంలో మోదీ వెళ్తారని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

నరేంద్ర మోదీ ప్రధానిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. రెండు దేశాల మధ్య ఉన్న కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత్, పాక్ ప్రధానుల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరగడం లేదని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...