ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలు మారిపోయిన తరుణాన, అగ్రరాజ్యాలకు ధీటుగా భారత్ స్వతంత్రంగా నిలబడిందని ప్రధాని మోదీ ప్రకటనలు చేసిన సమయంలోనే అత్యంత కీలక భేటీకి రంగం సిద్ధమైంది. రష్యా నుంచి భారత్ భారీ ఎత్తున ఇంధనాన్ని కొనుగోలుచేస్తుండటాన్ని అమెరికా వ్యరేకిస్తుండటం, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థవైఖరి తదితర పరిణామాల మధ్య భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో కీలక చర్చలు జరుపనున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సోమవారం విధానంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై సమీక్షిస్తారని, అలాగే దక్షిణాసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ప్రపంచ సమస్యలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
వర్చువల్ సమావేశం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మోదీ, బైడెన్ భేటీకి ముందు 2+2 మంత్రుల సమావేశం జరుగుతుందని తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా ఢిపెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశంలో పాల్గొంటారని తెలిపింది.
అయితే, మోదీతో బైడెన్ వర్చువల్ సమావేశం నిర్వహిస్తుందని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు నేతలు పరస్పర సహకారం తదితర అంశ ఆలపై చర్చిస్తారని వైట్‌హౌస్ సెక్రెటరీ పేర్కొన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని ఇండియాను అమెరికా పలు మార్లు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సోమవారం నాటి భేటీలో భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Joe Biden, Pm modi, Russia-Ukraine War, USA