Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: September 20, 2019, 5:38 AM IST
నరేంద్ర మోదీ, డొనాలల్డ్ ట్రంప్
PM Narendramodi America Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... రేపటి నుంచీ 27 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధానంగా టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్,... న్యూయార్క్‌లో ఆయన పర్యటనలు సాగనున్నాయి. రేపు ఢిల్లీ నుంచీ బయలుదేరే మోదీ... ముందుగా హోస్టన్ వెళ్తారు. అక్కడి రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతారు. అదే సమయంలో కొందరు కొందరు డెమొక్రటిక్ నేతలతో కలిసి మోదీ ప్రసంగిస్తారు. తర్వాతి రోజు 22న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోదీ పాల్గొని, ప్రసంగిస్తారు. ఆరోగ్యం, టెర్రరిజంపైనా మోదీ మాట్లాడతారు. తర్వాత NRG స్టేడియంలో ఎన్నారైలతో మోదీ చరిత్రాత్మక మీటింగ్ ఉంటుంది. అమెరికా టైమ్ ప్రకారం 22న ఉదయం 10 గంటలకు అది జరగనుంది. ఆ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తున్నారు. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొనే సభకు అమెరికా అధ్యక్షుడు రాబోతుండటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా 90 నిమిషాలపాటూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. వీటిలో 400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు.
ఎన్నారై సదస్సు తర్వాత 24న ఐరాస సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు మోదీ వెళ్తారు. అలాగే... అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా... ఐరాసలో 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అప్పుడే పారిశ్రామిక వేత్తలు, భారత ప్రతినిధి బృందంతో మోదీ మాట్లాడతారు. ఆ తర్వాత 27న తిరిగి భారత్ వస్తారు.
మోదీ అమెరికా టూర్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రధానంగా ట్రంప్‌తో మోదీ ఈ ఏడాది మూడోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకుముందు జపాన్‌లో జరిగిన జీ20 సదస్సులో, ఆ తర్వాత ఆగస్ట్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో వాళ్లిద్దరూ కలిశారు. 22న జరిగే హౌడీ-మోడీ ఎన్నారైల సదస్సులో ట్రంప్... ప్రవాస భారతీయులను ఉద్దేశించి... కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని తెలిసింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్న ట్రంప్... ఎన్నారై సదస్సును అందుకు వేదికగా చేసుకోబుతున్నారని తెలిసింది.
Published by:
Krishna Kumar N
First published:
September 20, 2019, 5:38 AM IST