PM Modi US Visit: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ (Prime Minister Narendra Modi) తొలిసారిగా ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటలకు వాషింగ్టన్‌లోని శ్వేత సౌధం వేదికగా బైడెన్‌తో(US President Joe Biden) ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇండో-యూఎస్ సంబంధాలు గురించి మాట్లాడారు. ఈ అగ్రనేతలు తమ సమావేశంలో వారం రోజుల్లో రాబోయే మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 2, గురించి మాట్లాడారు. అయితే వారి సంభాషణలో భాగంగా వచ్చిన ఒక అంశం ఇద్దరిలోనూ చిరునవ్వులు పూయించింది. ఆ అంశం ఏంటో తెలుసుకుందాం.
2013లో తన భారతదేశ తొలి పర్యటన సమయంలో బైడెన్ భారతదేశంలో తనకు దూరపు బంధువులు ఉన్నారని చెప్పుకొచ్చారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ముంబయిలో బైడెన్ అనే ఇంటి పేరు గల( Biden surname in India) ఐదుగురు నివసిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో నివసిస్తున్న లెస్లీ బైడెన్.. 1981లో జో బైడెన్ కి లేఖలు రాశారు. ఇండియాలో తనకు సంబంధించిన వారు ఉన్నారని అప్పుడే అర్థం చేసుకున్నారు బైడెన్. అతను కూడా ఆమెకు తిరిగి లేఖలు రాశారు. ఆ సమయంలో బైడెన్ సెనేటర్‌గా పని చేస్తున్నారు.
Amit Shah: దేశ అభివృద్ధిలో సహకారం సంఘాలు ఎంతగానో దోహదపడతాయి.. మెగా సదస్సులో అమిత్ షా కీలక ప్రసంగం
అయితే అప్పట్లో బైడెన్ ఇండియాలో తన వంశపారంపర్య చరిత్ర గురించి మాట్లాడినట్లు మోదీ తాజా చర్చల్లో ప్రస్తావించారు. అంతేకాదు బైడెన్ వంశపారంపర్య చరిత్రను తెలిపే పత్రాలు తీసుకొచ్చానని.. అవి బైడెన్ కు ఉపయోగపడొచ్చని చెప్పుకొచ్చారు. ఆ మాటలు వినగానే బైడెన్ తోపాటు అక్కడున్న అధికారులు అందరూ నవ్వేశారు. ఈ భేటీలో ఓ మహిళా అధికారిణి మోదీ హిందీలో చెప్పిన మాటలను ఇంగ్లీషులో తర్జుమా చేసి బైడెన్‌కి అర్థమయ్యేలా చెప్పారు.
PM Modi Assets: ప్రధాని మోదీ ఆస్తులు ఇవే.. ఆయన వద్ద ఎంత బంగారం, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయో తెలుసా..?
"మిస్టర్ ప్రెసిడెంట్ (యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్), మీరు ఈ రోజు భారతదేశంలో బైడెన్ ఇంటిపేరు గురించి వివరంగా మాట్లాడారు. మీరు ఇంతకు ముందు కూడా మీ చరిత్ర గురించి నాతో చెప్పారు. ఆ తర్వాత నేను మీ చరిత్రను తెలియజేసే పత్రాల కోసం వెతికి.. ఈరోజు ఆ పత్రాలను తీసుకువచ్చాను. బహుశా మేము ఈ విషయంలో మరిన్ని నిజాలు తెలుసుకోగలము. ఈ డాక్యుమెంట్లు మీకు ఉపయోగపడవచ్చు” అని మోదీ అన్నారు.
ఆ మాటలు వినగానే బైడెన్ బాగా నవ్వేశారు. మోదీ కూడా నవ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి. తర్వాత బైడెన్ మాట్లాడుతూ.. భారతదేశంలోని బైడెన్స్‌కి నాకు ఏదైనా సంబంధం ఉన్నట్లు మీరు కనుగొన్నరా? అని మోదీని ప్రశ్నించారు. దానికి, ప్రధాని మోదీ, “అవును" అని సమాధానమిచ్చారు.
ఇకపోతే, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, వాల్యూం సీ2 మార్చి 28/ఏప్రిల్ 4, 1981 ఎడిషన్ ‘అమెరికన్ ఎక్స్‌పర్టైజ్’ లో జో బైడెన్ పేరును కనుగొన్నారు వారి బంధువులు. తరువాత లెస్లీ.. జో బైడెన్‌కు లేఖ రాశారు. అప్పుడే ఫ్యామిలీ గురించి బైడెన్‌కు తెలియజేశారు. అనంతరం బైడెన్ లెస్లీకి మరో లేఖ రాశారు. ఇందులో తమ వంశ పూర్వీకులుగా భావిస్తున్న (common ancestor) జాన్ బైడెన్, అతని భార్య అన్నే బ్యూమాంట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వీరు ఫ్రెంచ్ మూలాలున్నవారు కావడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.