హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Modi Billgates: మీ రోటి సూపర్‌! బిల్ గేట్స్‌పై మోదీ ప్రశంసలు

Modi Billgates: మీ రోటి సూపర్‌! బిల్ గేట్స్‌పై మోదీ ప్రశంసలు

File (Photo: Twitter/@narendramodi)

File (Photo: Twitter/@narendramodi)

Modi Billgates: బిల్‌గేట్స్‌ మీరు సూపర్బ్‌ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫస్ట్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత బిల్‌గేట్స్‌కు ఓ విలువైన సలహా కూడా ఇచ్చారు మోదీ.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బిలియనర్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త బిల్ గేట్స్‌ని ప్రధాని మంత్రి మోదీ పొగిడారు. బిల్ గేట్స్ అమెరికన్ చెఫ్‌తో కలిసి రోటి తయారు చేసిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఫుల్‌గా ట్రెండ్‌ అయింది. ఈ వీడియో మన మోదీ దృష్టికి కూడా వచ్చింది. దీంతో మోదీ తనదైన స్టైల్‌లో స్పందించారు. బిల్‌గేట్స్‌ మీరు సూపర్బ్‌ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫస్ట్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత బిల్‌గేట్స్‌కు ఓ విలువైన సలహా కూడా ఇచ్చారు మోదీ.

Modi Insta story

ఇండియన్‌ రోటి బై బిల్‌ గేట్స్‌:

అమెరికాకు చెందిన ప్రముఖ చెఫ్ ఎయిటాన్‌తో కలిసి బిల్‌ గేట్స్ ఇండియన్‌ రోటి ప్రిపేర్‌ చేశారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఇటీవలే భారత్‌లోని బీహార్‌లో పర్యటించిన ఎయిటాన్‌ అక్కడ గోధుమ రైతులను కలుసుకున్నాడు. దీదీ కా రసోయ్ కమ్యూనిటీ క్యాంటీన్‌ మహిళలను కలుసుకుని రోటీలు చేయడం నేర్చుకున్నాడు కూడా. అయితే ఈ రోటి మేకింగ్‌ను బిల్‌ గేట్స్‌తో కలిసి ట్రై చేయాలని డిసైడ్‌ అయిన ఎయిటాన్‌.. అదే పని చేశాడు. బిల్‌ గేట్స్‌ను పిలిచాడు. ఇద్దరు కలిసి రోటి మేక్‌ చేశారు. వీడియోలో ఎయిటాన్, గేట్స్ ఇద్దరూ గోధుమ పిండి కలపడం దగ్గర నుంచి కాల్చడం.. దాన్ని టెస్ట్‌ చేయడం కూడా చూపించారు.

మిల్లెట్స్‌ ట్రై చేయండి: మోదీ

వీడియో వైరల్ కావడంతో మోదీ తనదైన స్టైల్‌లో ఇన్‌స్టా స్టోరీ పెట్టారు. గేట్స్ మంచి పనిచేశారని ప్రశంసించారు. భారత్‌లో తృణధాన్యాల ట్రెండ్ నడుస్తోందని, ఈసారి మిల్లెట్స్‌లో రోటీ ట్రై చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి తృణధాన్యాల సంవత్సరం జరుపుకుంటోన్న వేళ ఆయన గేట్స్‌కు ఇచ్చిన సలహాకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం భారత్‌లో ఆరోగ్యవంతమైన మిల్లెట్స్ ట్రెండ్ నడుస్తుందని, వీటిని కూడా ట్రై చేయండి అని బిల్ గేట్స్‌ను కోరారు. తాజాగా భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఇక చిరు ధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది. ఇక ఇటివల బడ్జెట్ ప్రసంగంలోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మిల్లెట్స్‌ విషయాన్ని ప్రస్థావించారు. జొన్న‌లు, రాగులు, స‌జ్జ‌లు, సామ‌లు, అరిక‌లు, కొర్ర‌లు వంటి మిల్లెట్స్ దిగుబ‌డిలో భార‌త్ రెండో అతిపెద్ద ఎగుమ‌తిదార‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. భార‌త్ మిల్లెట్స్‌లో గ్లోబ‌ల్ హ‌బ్‌గా ఎదిగింద‌ని, మిల్లెట్స్ ప్రోత్సాహానికి ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ శ్రీ అన్న రీసెర్చ్ తోడ్పాటు అందిస్తుంద‌ని పేర్కొన్నారు.

First published:

Tags: Bill Gates, Narendra modi

ఉత్తమ కథలు