హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఎదురులేని మనిషి: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత మోదీనే

ఎదురులేని మనిషి: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత మోదీనే

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

World Most Popular Leader : భార‌త ప్ర‌ధానమంత్రిగా న‌రేంద్ర‌మోదీ(PM Modi) బాధ్య‌త‌లు చేప‌ట్టి 8ఏళ్లు దాటినా ఆయన ఛ‌రిష్మా మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. జాతీయ స్థాయిలో ఎంత ఫాలోయింగ్ ఉందో అంత‌ర్జాతీయంగా కూడా మోదీకి అదే విధ‌మైన ఫాలోయింగ్ ఉంది

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

World Most Popular Leader : భార‌త ప్ర‌ధానమంత్రిగా న‌రేంద్ర‌మోదీ(PM Modi) బాధ్య‌త‌లు చేప‌ట్టి 8ఏళ్లు దాటినా ఆయన ఛ‌రిష్మా మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. జాతీయ స్థాయిలో ఎంత ఫాలోయింగ్ ఉందో అంత‌ర్జాతీయంగా కూడా మోదీకి అదే విధ‌మైన ఫాలోయింగ్ ఉంది. ప్రపంచ నేతల్లో నరేంద్ర మోడీయే మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు. ఇప్ప‌టికే అనేక‌మార్లు అనేక సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో ప్ర‌ధాని మోదీ ప్ర‌పంచ అత్యుత్తమ నేత‌గా(World Most Popular Leader)నిలవగా..తాజాగా అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ "మార్నింగ్ కన్సల్ట్‌(Morning Consult)"ప్ర‌పంచ అత్యుత్త‌మ నేత‌ల‌పై స‌ర్వేను నిర్వహించగా 75 శాతం ఓటింగ్‌తో ప్రధాని మోదీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. కాగా,మరికొన్ని నెలల్లో భార‌త్‌లోని కొన్ని రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు ముందు అంత‌ర్జాతీయ సంస్థ రిలీజ్ చేసిన స‌ర్వే బీజేపీకి అనుకూలంగా మారే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు.


మొత్తం 22 మంది అంతర్జాతీయ నేత‌ల‌పై మార్నింగ్ కన్సల్ట్‌ సంస్థ సర్వే నిర్వహించింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధికంగా 75 శాతం రేటింగ్ సంపాదించుకుని మోదీ టాప్ ప్లేస్ లో నిలిచారు. 63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. అయితే ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం 41 శాతం అప్రూవల్ రేటింగ్​తో 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో బైడెన్ తర్వాత స్థానంలో ఉన్నారు.ఎంత కష్టమొచ్చెనే : ప్రియుడితో భార్య జంప్..కొడుకుని ఎత్తుకొని తండ్రి రిక్షా సవారీమార్నింగ్ కన్సల్ట్‌... పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్‌ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మోడీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కోవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన ఒక సర్వేలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Joe Biden, Pm modi

ఉత్తమ కథలు