మోదీ భారత్‌కు తండ్రి లాంటి వారు.. డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చించిన వీరిద్దరు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 24, 2019, 10:58 PM IST
మోదీ భారత్‌కు తండ్రి లాంటి వారు.. డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
మోదీ, ట్రంప్ (ఫైల్)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 24, 2019, 10:58 PM IST
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చించిన వీరిద్దరు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హౌడీ, మోదీ సభకు వచ్చినందుకు ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌కే కాకుండా ట్రంప్ తనకు కూడా మంచి మిత్రుడని మోదీ అన్నారు. త్వరలోనే రెండు దేశాలు మరో వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నాయని, దాంతో భారత్, అమెరికా మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని వెల్లడించారు.

అనంతరం.. ట్రంప్ మాట్లాడుతూ మోదీ భారత్‌కు తండ్రిలాంటి వారని, ప్రజలు మోదీ అంటే ఎంత అభిమానిస్తున్నారో హౌడీ, మోదీ సభ‌ నిరూపించిందని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో ప్రధాని మోదీ స్పష్టంగా ఉన్నారని, ఆయన ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా నియంత్రిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...