Home /News /international /

PM MODI IN NEPAL INDIA AND NEPAL GROWING CLOSENESS WILL SERVE HUMANITY PVN

Modi In Nepal : బుద్దుడి జన్మస్థలంలో మోదీ..భారత్-నేపాల్ స్నేహం సమస్త మానవాళికి ప్రయోజనకరమన్న ప్రధాని

లుంబినిలో మోదీ

లుంబినిలో మోదీ

Modi In Lumbini : పండగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు ఇలా ఇరుదేశాల మధ్య వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోందని, వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలన్నారు.  ప్రేమ‌, సంస్కృతి, ఇరు దేశాల మ‌ధ్య అనాదిగా ఉన్నాయ‌ని గుర్తు చేశారు.

ఇంకా చదవండి ...
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. నేపాల్‌లో పర్యటిస్తున్నారు.  సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్‌ లో మోదీ నేపాల్‌ ‌కు చేరుకున్నారు. లుంబినిలో దిగిన మోదీకి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా సాదర స్వాగతం పలికారు.  బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని లుంబినిలోని మాయాదేవీ ఆలయాన్ని మోదీ సందర్శించారు.  నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో కలిసి మోదీ పూజలు నిర్వహించారు.  . ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను మోదీకి వివరించారు నిర్వాహకులు. అనంతరం మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవ్​బా, మోదీ లుంబినిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ మేరకు సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఆరు అవగాహనల ఒప్పందాలు చేసుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, లుంబిని బుద్ధిస్ట్ యూనివర్సిటీ, కాఠ్​మాండూ యూనివర్సిటీ- ఐఐటీ మద్రాస్, త్రిభువన్ విశ్వవిద్యాలయం మధ్య వివిధ ఒప్పందాలు జరిగాయి.

ఇరు దేశాల మధ్య 2020 నుంచి నెలకున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో మోదీ తాజా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని అయిన తర్వాత మోదీ 2014 నుంచి అక్కడకు వెళ్లడం ఇది ఐదోసారి. భారత్‌-నేపాల్ మధ్య శతాబ్దాల నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో చైనాకు దగ్గరవుతున్ననేపాల్.. భారత్‌ కు దూరమవుతోంది. ఈ తరుణంలో మోదీ నేపాల్‌లో పర్యటించి, బుద్ధుడి జన్మ స్థలం లుంబినీలో ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం.

భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి ఒకే కుటుంబంగా మారుస్తోందన్నారు. బుద్ధుడు జన్మించిన నేలపై ఉన్న శక్తి ఉత్తేజకరంగా ఉందన్నారు. ఇది విభిన్న అనుభూతిని ఇస్తోందని అన్నారు. బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడు... బుద్ధుడు అందరివాడని మోదీ అన్నారు. బుద్ధుడి జీవిత‌మంతా త్యాగ‌భూత‌మైన‌దేన‌ని మోదీ అన్నారు. రాముడికి సైతం నేపాల్​తో బంధం ఉందన్నారు. నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణమన్నారు. బుద్ధుడే మనల్ని కలుపుతున్నాడు... ఒకే కుటుంబంగా మార్చుతున్నాడని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలను నేపాల్​లోని ఎత్తైన పర్వతాల స్థాయికి చేర్చాలన్నారు.

ALSO READ Shivling Found In Masjid : జ్ఞాన్​వాపి మసీదులో బయటపడ్డ 12 అడుగుల శివలింగం!

పండగలు, సంస్కృతులు, కుటుంబ సంబంధాలు ఇలా ఇరుదేశాల మధ్య వేల సంవత్సరాలుగా బంధం కొనసాగుతోందని, వీటిని మనం శాస్త్ర, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాలకు విస్తరించాలన్నారు.  ప్రేమ‌, సంస్కృతి, ఇరు దేశాల మ‌ధ్య అనాదిగా ఉన్నాయ‌ని గుర్తు చేశారు. ఇవ‌న్నీ ఇరు దేశాల మ‌ధ్య ఎంత బ‌ల‌ప‌డితే.. బుద్ధ సందేశాన్ని అంత వేగంగా ప్ర‌పంచ వ్యాప్తం చేసిన‌వార‌మ‌వుతామ‌ని అన్నారు. సారానాథ్‌, బోధ్‌గ‌య‌, ఇండియాలోని ఖుషీన‌గ‌ర్‌… ఇవ‌న్నీ ఇరు దేశాల మ‌ధ్య స‌హ‌జ‌మైన వార‌స‌త్వ సంప‌ద అని అన్నారు. ఇక‌పై ఇరు దేశాలు క‌లిసి వీటిని మ‌రింత విస్త‌రించాల‌ని మోదీ ఆకాంక్షించారు. 2014లో లుంబినిలో నాటేందుకు తాను పంపించిన మహాబోధి మొక్క ఇప్పుడు చెట్టుగా మారిందని మోదీ పేర్కొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: India, Nepal, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు