హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Modi Number 1: మోదీ క్రేజ్‌ పీక్స్‌! వరల్డ్‌లోనే నంబర్‌వన్‌! బైడెన్‌ వెనక్కి..

Modi Number 1: మోదీ క్రేజ్‌ పీక్స్‌! వరల్డ్‌లోనే నంబర్‌వన్‌! బైడెన్‌ వెనక్కి..

Source: Morning consult political Intelligence

Source: Morning consult political Intelligence

Modi Number 1: ప్రధాని బాధ్యతలు చేపట్టిన 2014నుంచి తగ్గేదెలా అంటూ దూసుకుపోతున్న మోదీ క్రేజ్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అది ఏ సర్వే అయినా.. ఏ రేటింగ్‌ సంస్థ ఇచ్చిన నివేదికైనా.. మోదీనే టాప్‌..! అగ్రరాజ్యలైనా అమెరికా, బ్రిటన్‌ దేశాల అధ్యక్షులను సైతం వెనక్కి నెట్టి మరీ మోదీ తన స్టామినా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రధాని బాధ్యతలు చేపట్టిన 2014నుంచి తగ్గేదెలా అంటూ దూసుకుపోతున్న మోదీ క్రేజ్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అది ఏ సర్వే అయినా.. ఏ రేటింగ్‌ సంస్థ ఇచ్చిన నివేదికైనా.. మోదీనే టాప్‌..! అగ్రరాజ్యలైనా అమెరికా, బ్రిటన్‌ దేశాల అధ్యక్షులను సైతం వెనక్కి నెట్టి మరీ మోదీ తన స్టామినా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు. మరోసారి మోదీ చరిష్మా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో మోదీకి నంబర్ వన్ స్థానం దక్కింది. అది కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, బ్రిటన్‌ అధ్యక్షుడు రిషి సునాక్‌ను వెనక్కి నెట్టిమరీ మోదీ టాప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

మోదీకి ప్రపంచంలోనే అత్యధిక జనామోదం:

అత్యధిక జనామోదం పొందిన ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో అత్యధిక జనామోదం పొందిన దేశాధినేతల్లో నంబర్ వన్‌గా నిలిచారు. ఈ సంస్థ జనవరి 26 నుంచి 31 వరకు అధ్యయనం చేసి ఈ జాబితాను రూపొందించింది. 22 మంది దేశాధినేతలతో రూపొందించిన జాబితా ఇది. ఇందులో ఏకంగా 78 శాతం ప్రజామోదంతో మోదీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచారు. రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. స్విస్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 62 శాతం అప్రూవల్ రేటింగ్‌తో మూడో స్థానంలో 58 శాతం జనామోదంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మేలో అత్యధిక స్థాయిలో ఉంది. అయితే గతేడాది కరోనా పరిస్థితుల కారణంగా ఆయన అప్రూవల్ రేటింగ్స్ తక్కువకు పడిపోయింది.

మరోవైపు 40 శాతం జనామోదంతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆరు, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోలు ఏడో స్థానంలో నిలిచారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 30 శాతం ప్రజామోదంతో పదో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ తెలిపింది. ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43గా నమోదైంది. ప్రస్తుతం మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని వివిధ దేశాల నేతలకు సంబంధించిన అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసి వివరాలను అప్‌లోడ్‌ చేసింది.

First published:

Tags: Joe Biden, Modi, Rishi Sunak

ఉత్తమ కథలు