UAE New President : యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(UAE)కొత్త అధ్యక్షుడిగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు. యూఏఈ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుప్రీం కౌన్సిల్ శనివారం ఎన్నుకుంది.ఈ విషయాన్ని శనివారం అక్కడి మీడియా అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం మరణించిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్(73) స్థానంలో ఆయన నియమితులయ్యారు.
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 1948లో జన్మించారు. ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రెండవ అధ్యక్షుడు. అబుదాబికి 16వ పాలకుడు. ఆయన షేక్ జాయెద్ పెద్ద కుమారుడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడైన తర్వాత ఆయన ఫెడరల్ ప్రభుత్వాన్ని, అబుదాబి ప్రభుత్వాన్ని పునర్వ్యవస్థీకరించారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రపంచంలోని నాలుగవ ధనవంతుడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకార, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నికర విలువ 830 బిలియన్ డాలర్లు. ఈ మొత్తం పాకిస్థాన్ మొత్తం బడ్జెట్ కంటే 18 రెట్లు ఎక్కువ. పాకిస్తాన్ వార్షిక బడ్జెట్ సుమారు $45 బిలియన్లు. అధికారం చేపట్టిన తర్వాత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అనేక దేశాలలో పర్యటించారు. తన అభివృద్ధి పనుల ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కొత్త గుర్తింపును ఇచ్చారు. షేక్ ఖలీఫా 3 నవంబర్ 2004 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2019లో ఆయన నాల్గవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత, షేక్ ఖలీఫా UAE ప్రభుత్వం కోసం తన మొదటి వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించారు, UAE పౌరుల శ్రేయస్సు మరియు అభివృద్ధి కేంద్రంగా ఉంది. గృహనిర్మాణం, మరియు సామాజిక సేవలకు సంబంధించిన అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణం తరువాత, ప్రభుత్వం 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. జాతీయ సంతాప దినాలతో పాటు దేశంలోని అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలకు మూడు రోజుల సెలవు ప్రకటించారు.
ALSO READ Xi Jinping : చైనాలో కీలక పరిణామం..అధ్యక్ష పదవికి జిన్ పింగ్ రాజీనామా!
షేక్ ఖలీఫా పదవిలో ఉన్నప్పటికీ ఆయన అనారోగ్యం కారణంగా.. చాలా ఏళ్ల నుంచి షేక్ మొహమ్మద్ బిన్‌నే పాలన వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోషేక్ ఖలీఫా మరణంతో ఇప్పుడు ఆయన సోదరుడైన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పూర్తిస్థాయిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. యూఏఈకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కి వివిధ దేశాధినేతలతో పాటుగా భారత ప్రధాని కూడా శుభాకాంక్షలు తెలిపారు.షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ డైనమిక్,విజనరీ నాయకత్వంలో భారత్-యూఏఈ దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్న నమ్మకముందని మోదీ ఓ ట్వీట్ లో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.