హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

PM Modi: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మోదీ శాంతిని నెలకొల్పాలి..UNలో మెక్సికో

PM Modi: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మోదీ శాంతిని నెలకొల్పాలి..UNలో మెక్సికో

Image credit : ANI

Image credit : ANI

ఐక్యరాజ్య సమితి సమావేశంలో మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్ (Luis Ebrard Casaubón) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Mexico In UN : ఉజ్బెకిస్తాన్‌లోని షాంఘై సహకార సంస్థ 22వ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన సంభాషణ ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)కు మోదీ బహిరంగంగా హితోపదేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో మోదీని అంతర్జాతీయ మీడియా ఎంతగానో ప్రశంసించింది. ఈ నేపథ్యంలోనే మెక్సికో(Mexico) విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్ (Luis Ebrard Casaubón) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం ఐక్యరాజ్యసమితి(UN)లో ఓ ప్రతిపాదన చేశారు మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్. రష్యా , ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఆ కమిటీలో మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సభ్యులుగా ఉండాలని ఆయన కోరారు.

మెక్సికో ముందడుగు

ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించిన సంగతి విదితమే. అయితే గురువారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్చలో.. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పాలనే ప్రతిపాదనను మార్సెలో లూయిస్ అందరి ముందు ఉంచారు. న్యూయార్క్‌లో ఉక్రెయిన్ వివాదంపై మాట్లాడేందుకు భద్రతా మండలి చర్చలో పాల్గొన్నారు. శాంతిని నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు తమ వంతు ఉత్తమ ప్రయత్నాలను చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో భావిస్తున్నట్లు మార్సెలో లూయిస్ పేర్కొన్నారు. చర్చలు, దౌత్యం, సమర్థవంతమైన రాజకీయ మార్గాలను నిర్మించడం ద్వారానే శాంతిని సాధించవచ్చనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు.

రిసార్ట్ లోని రిసెప్షనిస్ట్ ని దారుణంగా హత్య చేసిన మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్!

ప్రయత్నాలు పెంచాలి..

ఉక్రెయిన్‌లో శాంతి కోసం కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను బలోపేతం చేయాలన్నారు మార్సెలో లూయిస్. అందుకు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో పంచుకుంటున్నామని తెలిపారు. అలానే ఈ కమిటీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ , పోప్ ఫ్రాన్సిస్‌తో సహా ఇతర దేశాధినేతలు, ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇది శాంతికి కట్టుబడి ఉండాల్సిన సమయం అని నొక్కి చెప్పారు.

చర్చల కోసం కొత్త యంత్రాంగాలను రూపొందించడానికి, విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి, తెరవడానికి మధ్యవర్తిత్వం కోసం సంపూర్ణమైన స్పేస్ సృష్టించడం UN కమిటీ లక్ష్యమని మార్సెలో లూయిస్ చెప్పారు. UN సెక్యూరిటీ కౌన్సిల్ ఉదాసీనతగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని... భద్రతా మండలి తన ముఖ్యమైన బాధ్యతను నెరవేర్చలేకపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఆ కౌన్సిల్‌లో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా భద్రతా మండలిలో రష్యాకు వీటో అధికారం ఉన్నందున భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజం ఉక్రెయిన్‌పై దండయాత్రను ముగించే మార్గాన్ని కనుగొనలేకపోయాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Mexico, Pm modi, Russia-Ukraine War, United Nations

ఉత్తమ కథలు