Home /News /international /

PM JACINDA ARDERN CANCELS HER WEDDING DUE TO OMICRON SURGE PVN

PM Marriage Cancel : ఒమిక్రాన్ విజృంభణ..దేశ ప్రధాని పెళ్లి రద్దు

న్యూజిలాండ్ ప్రధాని తన ప్రియుడితో(ణైల్ ఫొటో)

న్యూజిలాండ్ ప్రధాని తన ప్రియుడితో(ణైల్ ఫొటో)

New Zealand PM Wedding : ఒమిక్రాన్ కట్టడి కోసం కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్నందున వాటిని కాదని ఆ ప్రధాని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. నిబంధనల నేపథ్యంలో తన వివాహ వేడుకను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.

    Omicron Surge :   కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచానికి కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" టెన్షన్ పట్టుకుంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ను అరికట్టేందుకు అన్ని దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్నాయి. నైట్ కర్ఫ్యూలను విధించాయి. భౌతిక దూరాన్ని పాటించడానికి సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్‌లల్లో 50 శాతం సీట్ల సామర్థ్యానికి మాత్రమే అనుమతించాయి. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా పరిమితం చేశాయి. అయితే ఇవే ఆంక్షలు స్వయంగా ఓ దేశ ప్రధానమంత్రి పెళ్లిని అడ్డుకున్నాయి. ఒమిక్రాన్ కట్టడి కోసం కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్నందున వాటిని కాదని ఆ ప్రధాని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు.

    న్యూజిలాండ్‌లో తాజాగా ఒమిక్రాన్‌ కలకలం రేగింది. కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో వైరస్ సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం మరోసారి కొవిడ్‌ ఆంక్షలను కఠినతరం చేసింది. ఆదివారం అర్థరాత్రి నుంచి న్యూజిలాండ్‌లో కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి కరోనా ఆంక్షలు అమల్లోకి వస్తాయని,పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 100 మంది మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందని, వారు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించిది. మాస్కులను తప్పనిసరి చేశారు. వచ్చే నెలాఖరు వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిబంధనల నేపథ్యంలో తన వివాహ వేడుకను రద్దు చేసుకున్నట్లు దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ స్వయంగా ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

    ALSO READ Maju Varghese : బైడెన్ కి షాక్..వైట్ హౌస్ మిలటరీ హెడ్ రాజీనామా

    చాలాకాలంగా జసిండా.. క్లార్గ్ గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తోన్నారు. త్వరలోనే తాను ఆయనను పెళ్లి చేసుకోబోతున్నానంటూ ఇటీవలే ప్రకటించారు. వివాహ తేదీని మాత్రం వెల్లడించలేదు. కరోనా ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని పెళ్లిని రద్దు చేసుకున్నానని ప్రధాని జసిండా స్పష్టం చేశారు. ఇప్పట్లో తన పెళ్లి వేడుక జరగదని ఆమె చెప్పారు. ఆంక్షల నడుమ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని వారు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను అదే పని చేశానని తెలిపారు. మహమ్మారి కారణంగా ఇటువంటి అనుభవాలు ఎదుర్కొన్న అనేకమంది న్యూజిలాండ్‌ వాసుల జాబితాలో తానూ చేరానని చెప్పుకొచ్చారు. పెళ్లి వాయిదాపై ఎలా భావిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. జీవితం అంటే అలానే ఉంటుంది అంటూ బదులిచ్చారు.

    "కోవిడ్‌ నేపథ్యంలో గడ్డు పరిస్థితులు అనుభవించిన వేలాది మంది న్యూజిలాండ్‌ వాసులకు నేనేమీ భిన్నం కాదు. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే.. మనకు ఇష్టమైనవారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారిపక్కన ఉండలేకపోవడమే. ఇది చాలా బాధను కలిగిస్తుంది" అని ప్రధాని జసిండా తెలిపారు. కాగా, క్లార్క్ గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తున్న సమయంలోనే ఓ చిన్నారికి ప్రధాని జసిండా జన్మనిచ్చారు. ఆ చిన్నారికి నీవ్ తియారహ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ బాలిక వయసు రెండేళ్లు.
    Published by:Venkaiah Naidu
    First published:

    Tags: New Zealand, Omicron corona variant, Wedding

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు