Imran Khan: నెటిజన్లకు అడ్డంగా దొరికిన పాక్‌ ప్రధాని...ఫుల్‌గా ఆడేసుకుంటున్నారు...

ఇమ్రాన్ ఖాన్ (File)

మైక్రోసాఫ్ట్‌ బోర్డులో ఇప్పుడు బిల్‌ గేట్స్‌ లేరు. దీంతో బోర్డులో లేని బిల్‌ గేట్స్‌ను ‘ఇంక్యుబేషన్‌ ల్యాబ్‌’ ఏర్పాటు చేయమని అడిగి ఏం ఉపయోగం అంటూ నెటిజన్లు ట్వీట్లతో పాక్‌ ప్రధానిని కడిగిపారేస్తున్నారు.

  • Share this:
సోషల్‌ మీడియా పోస్టులను ఎంత జాగ్రత్తగా రాసినా ట్రోలర్స్‌ బారినపడిపోతున్నారు సెలబ్రిటీలు. దీనికి సినిమావాళ్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు.. ఎవరూ అతీతులు కారు. తాజాగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆయన చేసిన ట్వీట్‌ను పట్టుకొని నెటిజన్లు ఓ ఆట ఆడేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే...

పాకిస్థాన్‌లో పోలియో నిర్మూలన కోసం బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలియో రహిత పాకిస్థాన్‌ కోసం ఫౌండేషన్‌తో కలసి ఆ దేశ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌తో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సమావేశమయ్యారు. ఆ తర్వాత సమావేశ వివరాలను వెల్లడిస్తూ రెండు ట్వీట్లు చేశారు. అందులో ఒక ట్వీటుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తే, రెండో ట్వీట్‌పై మాత్రం ట్రోల్స్ వస్తున్నాయి. తొలి ట్వీట్‌లో బిల్‌ గేట్స్‌తో జరిగిన మీటింగ్‌ వివరాలు, దేశంలో పోలియో నివారణకు చేపడుతున్న, చేపట్టిన వివరాలను వివరించారు ఇమ్రాన్‌ ఖాన్‌. అక్కడిదాకా బాగానే రెండో ట్వీట్‌లోనే పప్పులో కాలేశారు.

‘బిల్‌ గేట్స్‌తో జరిగిన సమావేశంలో ఆయనను మరో విషయం కూడా అడిగాను. దేశంలో మైక్రోసాఫ్ట్‌ ఇంక్యుబేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయమని అడిగాను’ అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు ఇమ్రాన్‌ ఖాన్‌. అందులో తప్పేముంది? దేశం కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ అడిగారు కదా అనుకోవద్దు. ఇక్కడ విషయం ఏంటంటే... మైక్రోసాఫ్ట్‌ బోర్డులో ఇప్పుడు బిల్‌ గేట్స్‌ లేరు. దీంతో బోర్డులో లేని బిల్‌ గేట్స్‌ను ‘ఇంక్యుబేషన్‌ ల్యాబ్‌’ ఏర్పాటు చేయమని అడిగి ఏం ఉపయోగం అంటూ నెటిజన్లు ట్వీట్లతో పాక్‌ ప్రధానిని కడిగిపారేస్తున్నారు. ఆయన బోర్డులో ఉండుంటే.. ఏదో మాట చెప్పి, నిర్ణయం తీసుకునేవారు. ప్రధాని స్థాయి వ్యక్తికి ఆ మాత్రం ఈ విషయం తెలియదా అంటూ నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు.

ఇక బిల్‌గేట్స్‌ సంగతి చూస్తే... మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఓ ఉద్యోగితో కొన్నాళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిపారని ఆరోపణలు వచ్చాయి. దానిపై మైక్రోసాఫ్ట్‌లో అంతర్గత విచారణ జరిగింది. 2019లో విచారణ మొదలవ్వగా, 2020లో ఇంకా నివేదిక రాకుండానే ఆయన బోర్డు నుంచి వైదొలిగారు. అలాంటిది ఇప్పుడు ఆయనను పాక్‌ ప్రధాని ‘ఇంక్యుబేషన్‌ ల్యాబ్‌’ ఏర్పాటు చేయమని కోరడం వింతే కదూ. అందుకే నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: