హఫీజ్ ‘రాజకీయ’ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ

ఎంఎంఎల్ దరఖాస్తును తిరస్కరిస్తూ ఏడాది క్రితం ఇచ్చిన రూలింగ్‌ను పున:పరిశీలించాలని పాక్ ఎన్నికల సంఘాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది.

Janardhan V | news18
Updated: June 14, 2018, 11:12 AM IST
హఫీజ్ ‘రాజకీయ’ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ
హఫీజ్ సయ్యిద్. (ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: June 14, 2018, 11:12 AM IST
  • Share this:
పాకిస్థాన్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పాక్ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యిద్ చేసిన కుటిల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. జమాతుద్ దావా వ్యవస్థాపకుడైన హఫీజ్, మిల్లి ముస్లీం లీగ్(ఎంఎంఎల్) పేరిట తన రాజకీయ పార్టీని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది క్రితం ఈ దరఖాస్తును పాక్ ఎన్నికల కమిషన్ తిరస్కరించగా...దీనిపై ఆయన ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశాడు. హఫీజ్ అభ్యర్థనను పున:పరిశీలించాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టు పాక్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మరికొన్ని వారాల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో హఫీజ్‌కు చెందిన ఎంఎంఎల్‌ను రాజకీయ పార్టీగా గుర్తించలేమని నలుగురు సభ్యులతో కూడిన పాక్ ఎన్నికల కమిషన్ బెంచ్ స్పష్టంచేసింది.

నిషేధిత జమాతుద్ దావాతో ఎంఎంఎల్‌కు ఉన్న సంబంధాలను పరిగణలోకి తీసుకుని పాకిస్థాన్ హోం శాఖ సిఫార్సు మేరకు రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల సంఘం తన రూలింగ్‌లో స్పష్టంచేసింది. నిషేధిత సంస్థ జమాతుద్ దావాతో ఎంఎంఎల్‌కు సంబంధాలున్నందున, దాన్ని రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయకూడదని పాక్ హోం మంత్రిత్వ శాఖ గతంలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.

అయితే తమ సంస్థకు జమాతుద్ దావాతో ఎలాంటి సంబంధాలు లేవని, ఎంఎంల్ వ్యవస్థాపకుడు సైఫుద్దీన్ ఖలీద్‌కు హఫీజ్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణల్లోనూ నిజం లేదని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. తమ దరఖాస్తున్న ఎన్నికల సంఘం నిరాకరించడం వెనుక అధికార పీఎంఎల్(ఎన్) పార్టీ, ఆ పార్టీ నాయకత్వం ప్రోద్భలం ఉందని ఆరోపించింది.
Published by: Janardhan V
First published: June 14, 2018, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading