• HOME
 • »
 • NEWS
 • »
 • INTERNATIONAL
 • »
 • PLASTICS WEIGHING 14 MILLION TONNES LIKELY PRESENT AT BOTTOM OF OCEANS STUDY DETAILS HERE MS

Plastic wastage in Oceans: సముద్ర గర్భాన గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు.. ఎంత పేరుకుపోయిందంటే..?

Plastic wastage in Oceans: సముద్ర గర్భాన గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు.. ఎంత పేరుకుపోయిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ఈ భూ ప్రపంచం మీద వేలాది జలాచరాలకు ఆవాసాన్నిస్తున్న సముద్రాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం సముద్ర తీరాలనే కాదు.. మొత్తం పర్యావరణాన్నే నాశనం చేస్తున్నది.

 • News18
 • Last Updated:
 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని తలపెడుతున్నది. వందల కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగయి.. మానవ మనుగడకే సవాల్ విసురుతున్నాయి. రోజురోజుకూ మారుతున్న మనిషి అవసరాలకు అనుగుణంగా ప్లాస్టిక్ వినియోగం కూడా ఎక్కువవుతుండటంతో అది వాతావరణ మార్పులకూ కారణమవుతున్నది. ఇక వందల కోట్లాది జలాచరాలకు ఆవాసంగా ఉండే సముద్రాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

  సముద్ర తీరాల వద్దకు వెళ్లే పర్యాటకులు.. నదులు, చెరువులు, కాల్వలలో పడవేస్తున్న వ్యర్థాలన్నీ సముద్రాలలో కలిపేస్తుండటంతో అవి తీవ్రంగా కలుషితమవుతున్నాయి. ఆ ఫలితంగా.. ఇప్పటివరకూ సముద్రాలలో 14 మిలియన్ టన్నుల (సుమారు ఒక కోటి నలభై లక్షల టన్నులు) చెత్త పోగై ఉన్నది.అది ఒక్కోటి 5.5 మిల్లీ మీటర్ల కంటే తక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. గ్రేట్ ఆస్ట్రేలియా బైట్ కు సమీపంలో ఉన్న దక్షిణ తీరంలో దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరు ప్రాంతాల వద్ద సముద్రపు అడుగు భాగాల నుంచి వెలికితీసిన వ్యర్థాల ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు.

  దాదాపు 50 నమూనాలను పరిశీలించిన అధ్యయనవేత్తలు.. ఏడు మహా సముద్రాలలో 30 రెట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు.. సముద్రపు ఉపరితలం వద్ద ఉన్నట్టు తెలిపారు. దీనిపై రీసెర్చ్ చేసిన సీఎస్ఐఆర్వో ప్రధాన పరిశోధనా శాస్త్రవేత్త డాక్టర్ డెనిస్ హార్డెస్టీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఏరియాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను కనుగొనడం మాకు ఆశ్చర్యానికి గురిచేసింది. దీని ప్రకారం.. ప్రపంచంలో మీరు ఏ మూలకు వెళ్లినా ప్లాస్టిక్ కనిపిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రాలు లేని దగ్గర కుప్పలు తెప్పలుగా ఉండే ప్లాస్టిక్... సముద్రాలలో కూడా పేరుకుపోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే మానవ జాతి మనుగడకే సవాలు అని హెచ్చరించారు. వీలైనంత మేర ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడం మానవాళి బాధ్యత అని గుర్తు చేశారు.
  Published by:Srinivas Munigala
  First published: