Home /News /international /

PLANE WRECKAGE FOUND IN NEPAL MOUNTAINS 14 BODIES RECOVERED PVN

Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదం..14 మంది మృతదేహాలు లభ్యం

విమానం క్రాష్

విమానం క్రాష్

14 bodies recovered :

నలుగురు భారతీయులు సహా 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం 9N-AETఆచూకి లభ్యమైంది. నేపాల్‌ ఆర్మీ అధికారులు భావించినట్టుగానే ఆ ప్లేన్‌ క్రాష్‌ అయింది. ఈ విమాన శకలాలను ముస్తాంగ్‌ జిల్లాలోని కోవంగ్‌ ప్రాంతంలో గుర్తించారు. రెండు ఇంజిన్‌ లు కలిగిన ఈ విమానం ఆదివారం ర్యాటక నగరమైన పోఖ్రా నుంచి ఇవాళ ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయింది. విమానం జోమ్సోమ్ విమానాశ్రయంలో ఉదయం 10:15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే పోఖ్రా నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది. వెంటనే రంగంలోకి దిగిన నేపాల్‌ ఆర్మీ, ఏవియేషన్‌ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. మంచు తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఆదివారం పూర్తిస్థాయిలో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడింది.

దీంతో ఉదయమే ఆర్మీ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. లంచే నదికి ఎగువన మనపతి హిమల్‌ ప్రదేశంలో క్రాష్‌ అయినట్టు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా విడుదల చేశారు. నేపాల్‌ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ప్రతికూల వాతావరణం ఉండటంతో సన్సోవార్‌లో ఉన్న కొండల అంచులను ఢీకొట్టిన విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయిందని... దీంతో విమానం ఆచూకీని గుర్తించడానికి అధికారులకు ఆసల్యమయిందని అధికారులు తెలిపారు.

ALSO READ Terrorist killed:కశ్మీర్ లో ఎన్ కౌంటర్..జైషే ఉగ్రవాది హతం

ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానంలో ముంబైకి చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠిలతో పాటు ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలి ప్రయాణికులు ఉన్నారు.  వీరిలో చాలా మంది ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తున్నట్లు సమాచారం.  కాగా, జమ్సోమ్ ప్రాంతానికి విదేశీ ట్రెక్కర్లు ఎక్కువగా వస్తుంటారు. అలాగే,ముక్తినాథ్​ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్​, నేపాలీ భక్తులు పర్యటిస్తారు. ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించాలంటే దగ్గర్లోని ఎయిర్ పోర్ట్ ఇదే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Nepal, Plane Crash

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు