టర్కీలోని ఇస్తాంబుల్ సిటీలో విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పిన విమానం.. రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లి పడిపోయింది. అనంతరం రెండు ముక్కలుగా విమానం విడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇస్తాంబుల్‌లోని సబీహా గోకెన్ ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానం పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. విమానం కిందపడిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని.. ఎయిర్‌పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారని చెప్పారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అభిప్రాయపడ్డారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు అధికారులు. విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Twenty one people are injured after a plane has skidded off a runway, split in two and burst into flames.
— Aviation Safety Consulting (@avsafeco) February 5, 2020
The Pegasus Airline's Boeing 737-800 in an internal flight from Izmir appears to have skidded in wet weather at Istanbul's airport in Turkey.#sms #safetymanagementsystems pic.twitter.com/EclPiDYeL4
A Turkish @flymepegasus plane burst into flames in Turkey’s Istanbul. Reports say it’s close to the Sabiha Gökçen airport and that the plane skid off a runway. No official information on casualties or injuries. #Pegasus pic.twitter.com/8bzOKQh220
— Hatice ‘Deniz’ AVCI (@HaticeDenizAVCI) February 5, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Plane Crash, Turkey