హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Viral Tweets : మలయాళంలో దుబాయ్ రాజు ట్వీట్..అరబిక్ లో కేరళ సీఎం రిప్లై

Viral Tweets : మలయాళంలో దుబాయ్ రాజు ట్వీట్..అరబిక్ లో కేరళ సీఎం రిప్లై

Dubai Ruler Malayalam Tweet : "కేరళతో యూఏఈ ప్రత్యేక సంబంధం కలిగి ఉంది. దుబాయ్, యూఏఈ ఆర్థికాభివృద్ధితో పాటు అన్ని రకాల అభివృద్ధిలో కేరళ ప్రజల పాత్ర ఎంతో గొప్పది" అంటూ ప్రధాని రషీద్ అల్ ముక్తమ్ మలయాళంలో ట్వీట్ చేశారు.

Pinarayi Vijayan replies in Arabic :  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు. యూఏఈ ఉపాధ్యక్షుడు,ప్రధానమంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో బుధవారం సీఎం విజయన్ భేటీ అయ్యారు. కేరళ ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్, దుబాయ్ డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి షేక్ మక్తమ్ బిన్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్, ఎమిరైట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్, దుబాయ్ పౌరవిమానయాన ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎం విజయన్ వెంట కేరళ పరిశ్రమల మంత్రి రాజీవ్, భారత రాయబారి సంజయ్ సుధీన్, కాన్సుల్ జనరల్ అమన్ పురి, లూలూ గ్రూప్ ఛైర్మన్, అబుదాబి ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ అలీ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేరళ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారని సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, వ్యాపార అనుకూలమైన తమ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తో భేటీ అయిన వెంటనే యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ విషయాన్ని మలయాళంలో ట్వీట్​ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో తాను సమావేశమైనట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. "కేరళతో యూఏఈ ప్రత్యేక సంబంధం కలిగి ఉంది. దుబాయ్, యూఏఈ ఆర్థికాభివృద్ధితో పాటు అన్ని రకాల అభివృద్ధిలో కేరళ ప్రజల పాత్ర ఎంతో గొప్పది" అంటూ ప్రధాని రషీద్ అల్ ముక్తమ్ మలయాళంలో ట్వీట్ చేశారు. అంతేకాకుండా,దుబాయ్ ఎక్స్ పో 2020 వేదికపై విజయన్‌ కు ఇచ్చిన ఆతిథ్యం ఫొటోను కూడా యూఏఈ ప్రధాని ట్విట్టర్ లో షేర్​ చేశారు. .ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ట్వీట్‌ను పలువురు ప్రవాస భారతీయులు షేర్ చేస్తున్నారు.

ALSO READ Bride delivery: పెళ్లి వేడుకలో వధువుకు అకస్మాత్తుగా కడుపు నొప్పి.. బిడ్డకు జన్మనిచ్చి తల్లయింది..

ఈ ట్వీట్ ను కేరళ సీఎం విజయన్ కూడా తన ట్విట్టర్ లో విజయన్ షేర్ చేశారు. అంతేకాకుండా అరబిక్ భాషలో ఆయన రిప్లై ఇచ్చారు. మీ అపూర్వ స్వాగతం, ఆతిథ్యానికి ధన్యవాదాలు.. యూఏఈ, దుబాయ్ లతో బంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం అంటూ అరబిక్‌ లో సీఎం విజయన్ యఏఈ ప్రధాని మలయాళం ట్వీట్ కు అరబిక్ లో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

First published:

Tags: Dubai, Kerala, Malayalam

ఉత్తమ కథలు