హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

OMG : అందరూ హైఅలర్ట్..విమానం కూల్చివేస్తానని పైలట్ బెదిరింపు!

OMG : అందరూ హైఅలర్ట్..విమానం కూల్చివేస్తానని పైలట్ బెదిరింపు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pilot threatening to crash plane : వాల్‌మార్ట్ స్టోర్‌ పై విమానాన్ని క్రాష్ చేస్తానని పైలట్ బెదిరిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Pilot threatening to crash plane : అమెరికాలోని మిస్సిస్సిప్పి (Mississippi)లో ఓ ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి శనివారం విమానాన్ని(Plane) దొంగిలించాడు. మిస్సిస్సిప్పిలో విమానాన్ని దొంగలించిన అతడు..టుపేలో(Tupelo)లో నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్‌(Wallmart Store) పై విమానాన్ని క్రాష్(Plane Crash) చేస్తానని బెదిరిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పైలట్ బెదిరింపులతో వాల్‌మార్ట్ స్టోర్‌ లోని కస్టమర్లను,ఉద్యోగులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు టుపేలో పోలీస్ డిపార్ట్మెంట్(TPD)తెలిపింది. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో విమానం టుపేలోలో చక్కర్లుకొడుతూ కనిపించిందని ఫేస్ బుక్ లో పోలీసులు తెలిపారు. E911తో కాంటాక్ట్ అయిన పైలట్..తాను విమానాన్ని వెస్ట్ మెయిన్ లో ఉన్న వాల్ మార్ట్ పై క్రాష్ చేస్తాను అని బెదిరించాడని ఫేస్ బుక్ లో తెలిపారు.

బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90 విమానాన్ని ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేస్తానని బెదిరిస్తున్న పైలట్‌ను నేరుగా సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. అన్ని క్లియర్ అయ్యే వరకు పౌరులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. TPD,ఆ ప్రాంతంలోని అన్ని అత్యవసర సేవల విభాగాలు హై అలర్ట్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వీడెవడండీ బాబు : KGF చూసి ఫేమస్ అయ్యేందుకు 4గురిని హత్య చేశాడు

"స్టేట్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ మేనేజర్స్ ఈ ప్రమాదకరమైన పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు" అని గవర్నర్ టేట్ రీవ్ ట్విట్టర్‌లో తెలిపారు. "పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి, టుపెలో పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చే అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవాలి"అని గవర్నర్ కోరారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Pilot, Plane Crash, USA, Video

ఉత్తమ కథలు