హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అదృష్టవంతుడు... చెట్టుపై విమానం... ప్రాణాలతో బయటపడిన పైలట్...

అదృష్టవంతుడు... చెట్టుపై విమానం... ప్రాణాలతో బయటపడిన పైలట్...

చెట్టులో ఇరుక్కున్న విమానం (Image : AP )

చెట్టులో ఇరుక్కున్న విమానం (Image : AP )

Pilot Crash : ఎవరూ ఊహించలేదు... ఆ విమానం కూలుతుందని. ప్రాణాలతో బయటపడిన ఆ పైలట్ చాలా అదృష్టవంతుడంటున్నారు అంతా.

    అమెరికాలోని ఇడాహోలో... ఓ పైలట్ తన చిన్న విమానాన్ని ఇడాహో మైదానంలో ల్యాండ్ చేద్దామని ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో... విమానం తిన్నగా వెళ్లి... 60 అడుగుల ఎత్తున ఓ చెట్టుపై కూలింది. ఆ టైంలో అంతా చీకటిగా ఉంది. ఆ సింగిల్ ఇంజిన్ విమానానికి ఏం జరిగిందో కొన్ని క్షణాలపాటూ పైలట్ జాన్ గ్రెగరీకి అర్థం కాలేదు. చెట్టుపై కూలిన విమానం అక్కడి నుంచీ కింద పడేదే. లక్కీగా దాని ఒక రెక్క... చెట్టులో ఇరుక్కుంది. దాంతో అది కూలిపోకుండా వేలాడసాగింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికొచ్చి... పైలట్‌ను సురక్షితంగా కాపాడారు. ఇప్పుడా దృశ్యాన్ని చూస్తున్నవారంతా చెట్టు ఎక్కి... అసలా విమానం అక్కడ ఎలా ఇరుక్కుందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.


    pilot,plane,tree,idaho,usa,america,crash,plane crash,tree,fire department,viral news,safe,పైలట్,విమానం,కూలిన విమానం,చెట్టుపై కూలిన విమానం,చెట్టులో ఇరుక్కున్న విమానం,ప్లేన్ క్రాష్,విమాన ప్రమాదం,ఇడాహో,అమెరికా,వైరల్ న్యూస్,వైరల్,
    చెట్టులో ఇరుక్కున్న విమానం (Image : AP )


    విమానంలో ఎక్కువ భాగం ఒక చెట్టుపైనే ఉందన్న పైలట్... మరో చెట్టును కూడా అది టచ్ చేసి ఉందని తెలిపాడు. ఇలాంటి సీన్ తాము ఎప్పుడూ చూడలేదన్న ఫైర్ సిబ్బంది... పైలట్‌ను రక్షించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక స్థానికులైతే... ఆ విమానాన్ని ఫొటోలు తీసుకుంటూ, షేర్ చేసుకుంటున్నారు.


     


    ఇవి కూడా చదవండి :


    ఇండియాలో 57 శాతం హెడ్ అండ్ నెక్ కాన్సర్ కేసులు... ఆందోళన కలిగించే అంశమే...


    ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు... ప్రచారానికి దూరంగా అల్కా లంబా...


    తృటిలో తప్పిన ప్రమాదం... రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంజిన్ ట్రబుల్...


    21,000 మంది సిబ్బంది... మే 23న భారీ భద్రత మధ్య ఏపీ ఎన్నికల లెక్కింపు...

    First published:

    Tags: International, Plane Crash, World

    ఉత్తమ కథలు