హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Photoshoot: ప్రాణాల మీదకు తెచ్చిన ఫొటోషూట్.. చిరుతల పక్కన ఫొటోలు దిగుతుండగా ఏమైందంటే..

Photoshoot: ప్రాణాల మీదకు తెచ్చిన ఫొటోషూట్.. చిరుతల పక్కన ఫొటోలు దిగుతుండగా ఏమైందంటే..

చిరుత (Instagram/Photo)

చిరుత (Instagram/Photo)

ఫొటోషూట్(photshoot) ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. కాస్త వైవిధ్యంగా ఫొటోలు ఉండాలన్న ఆమె తాపత్రయం ఆస్పత్రి(Hospital) పాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు ఫొటోషూట్స్ ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఫొటో షూట్ లు చేస్తున్నారు అనేక మంది. రోడ్లపై, బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఫొటో షూట్లు నడుస్తున్నాయి. ఇలా ఫొటో షూట్ చేసుకుంటూ ప్రమాదాలకు గురైన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారంటే అతిషయోక్తి కాదు. తాజాగా ఓ మోడల్ ఫొటో షూట్ కు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. జంతువులు ఉన్న ప్రదేశంలో ఫొటో షూట్ కు వెళ్లిన ఆ మహిళ వాటి దాడికి గురైంది. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది ఆ మోడల్. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు జర్మనీలోని సాక్సోనీ అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేట్ స్థలంలో ఓ వ్యక్తి జంతువుల ప్రదర్శన కోసం రిటైర్మెంట్ హోంను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీకి చెందిన జెస్సికా లీడోల్ఫ్ (36) అనే మోడల్ చిరుతల బోనుకు దగ్గరగా ఫోటోషూట్ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రెండు చిరుతలు ఆమె పై ఒక్కసారిగా దాడి చేశాయి.

New York Woman: ప్రపంచంలోనే అత్యంత పిసినారి మహిళ.. డబ్బు ఎలా ఆదా చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఈ దాడిలో ఆ మోడల్ చెవులు, చెంపలపై గాయాలయ్యాయి. దీంతో స్పందించిన స్థానికులు, నిర్వాహకులు ఆమెను హెలికాప్టర్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మోడల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె తలకు తీవ్రంగా గాయాలు కావడంతో సర్జరీ చేసినట్లుగా స్థానిక పోలీసులు వెల్లడించారు. చిరుత దాడికి సంబంధించిన మచ్చలు ఆమె ముఖం, తలపై శాశ్వతంగా ఉండిపోతాయని వైద్యులు చెబుతున్నారు.

International Dog Day: ప్రపంచంలో ఖరీదైన కుక్కలు... కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

అయితే మోడల్ జెస్సికాతో పాటు ఫొటో షూట్ లో ఇంకా ఎవరు పాల్గొన్నారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బోనులో నుంచి చిరుతలు బయటకు రాలేదని వారు చెప్పారు. అయితే.. ఆ మోడల్ చిరుతలు ఉన్న బోను సమీపంలోకి వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు.

First published:

Tags: Germany, Hot Photoshoot, Leopard, Leopard attack