Home /News /international /

PHILIPPINES SUPER TYPHOON RAI DEATH TOLL RISES TO 146 COULD BE MORE SAYS OFFICIALS MKS

Philippines: రాయ్ కాదది రాకాసి! -ఇప్పటికే 146 మందిని బలి తీసుకున్న Super Typhoon Rai

సూపర్ టైపూన్ రాయ్ దెబ్బకు ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

సూపర్ టైపూన్ రాయ్ దెబ్బకు ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

ఫిలిప్పీన్స్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన సూపర్ టైఫూన్ రాయ్ కారణంగా ఆ దేశం అతలాకుతలమైంది. దీని దెబ్బకు ఇప్పటికే 146 మంది మృతి చెందారని, మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఆగ్నేయ ఆసియాలోని ద్వీపసముదాయ దేశం ఫిలిప్పీన్స్ మునుపటిలా లేదిప్పుడు. చరిత్రలో అత్యంత శక్తిమంతమైన తుపాన్లలో(సూపర్ టైపూన్) ఒకటైన రాయ్ ఆ దేశాన్ని దాదాపు నేలమట్టం చేసింది. వేల కొద్దీ ఊళ్లూ జలప్రవాహంలో కొట్టుకుపోయాయి. సూపర్ టైపూన్ రాయ్ ధాటికి దేశమంతటా అత్యంత భారీ వర్షాలు, అతితీవ్రమైన గాలుల కారణంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనం గల్లంతయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం సాయత్రానికి(భారత కాలమానం ప్రకారం) రాయ్ టైపూన్ మరణాల సంఖ్య 146కు పెరిగింది. గల్లంతైనవారి సంఖ్య కూడా వందల్లోనే ఉంది.

ఫిలిప్పీన్స్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన సూపర్ టైఫూన్ రాయ్ కారణంగా ఆ దేశం అతలాకుతలమైంది. దీని దెబ్బకు ఇప్పటికే 146 మంది మృతి చెందారని, మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

Pushpa.. ఇంత దారుణమా? -భార్యాభర్తలు చెరోవైపు చేరి బాలికను నగ్నంగా పడుకోబెట్టి.. ఏళ్లపాటు..



రాయ్ టైపూన్ వల్ల 3 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారని, మరో 8 లక్షల మంది దీని ప్రభావానికి గురైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్ ఇదేనని అధికారులు పేర్కొన్నారు.

రాయ్ టైపూన్ ధాటికి ఫిలిప్పీన్స్ లో ఇళ్లు, వ్యాపార సముదాయాలేకాదు, కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలాయి. ఆసుపత్రులు సైతం ధ్వంసమయ్యాయి. గ్రామాల్లోకి వరద ముంచెత్తింది. విద్యుత్ స్తంభాలు కాంక్రీట్‌తో సహా నేలకొరిగాయి. ఎటు చూసినా భీతావాహదృశ్యాలే కనిపిస్తున్నాయి.

plane crash : సముద్రంలో కూలిపోయిన విమానం.. 2చిన్నారులు సహా 4గురు దుర్మరణం..


గంటకు 195 కిలోమీటర్ల వేగతంతో గాలులు వీచే సూపర్ టైఫూన్‌గా రాయ్ గురువారం దేశంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ టైఫూన్ ఫిలిప్పీన్స్‌ను దాటడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ, అది మిగిల్చిన విధ్వంసం మాత్రం అసాధారణ స్థాయిలో ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Cyclone, Philippine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు