ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. 85 మంది సైనికులతో వెళ్తున్న ఓ మిలటరీ విమానం కుప్పకూలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్.. అందులో ప్రయాణిస్తున్న 40 మందిని రక్షించారు. ‘Philippine C-130 విమానం సైనికులతో బయలుదేరింది. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని జోలో ద్వీపంలో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది’ అని ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రమాదం సమయయంలో విమానంలో 85 మంది ఉన్నట్టుగా మిలటరీ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న 40 మందిని బయటకు తీసినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక, విమానంలో ఉన్నవారంతా ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లని సమాచారం. వీరిని జోలో ద్వీపానికి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.