దేశాధ్యక్షుడి లిప్ కిస్‌పై దుమారం..!

దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ఓ కార్యక్రమంలో రొడ్రిగో మహిళను పెదాలపై ముద్దుపెట్టాడు. దీనిపై ఫిలిప్పిన్స్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. సోషల్ మీడియాపై వేదికగా నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. అటు మహిళా సంఘాలు, ప్రతిపక్షాలురొడ్రిగో చర్యపై మండిపడ్డాయి.

Shiva Kumar Addula | news18india
Updated: June 6, 2018, 2:48 PM IST
దేశాధ్యక్షుడి లిప్ కిస్‌పై దుమారం..!
సియోల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళను పెదాలపై ముద్దాడిన ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యురట్టే (PTV via AP)
  • Share this:
ఫిలిప్పిన్స్ నిరంకుశ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమంలో అందరూ చూస్తుండగా వివాహిత మహిళలను ముద్దుపెట్టడంపై దుమారం రేగుతోంది. దేశాధ్యక్షుడి తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐతే స్త్రీ ద్వేషిగా ముద్రపడిన రొడ్రిగో.. ఇలా ముద్దులు పెట్టడంపై దేశ ప్రజలు షాక్‌కు గురయ్యారు.

రొడ్రిగో మూడు రోజుల పాటు సౌత్ కొరియాలో పర్యటించారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం సియోల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 వేల మంది ఫిలిప్పినోలు సభకు హాజరయ్యారు. అయితే పుస్తకాలను బహూకరించే క్రమంలో ఇద్దరు మహిళలను వేదిక మీదకు పిలిచారు రొడ్రిగో. దానికి బదులుగా తనకు ముద్దులు  ఇవ్వాలని కోరారు. ఆ ఇద్దరు మహిళలు పుస్తకాలు తీసుకొని.. రొడ్రిగో చేతులను ముద్దాడి వెళ్లిపోబోయారు. అంతలో మళ్లీ కలగజేసుకున్న రొడ్రిగో..  తనకు మరో ముద్దు కావాలని రొడ్రిగో అడిగారు. దీంతో ఓ మహిళ ఆయన బుగ్గులపై ముద్దు పెట్టింది. మరో మహిళ ముద్దు పెడుతుండగా పెదాలను చూపించారు. అనంతరం ఆమెను పెదాలపై ముద్దుపెట్టారు.

అంతే కాదు..   నువ్వు సింగిలా? అని  సదరు మహిళలను అడగ్గా.. కాదు పెళ్లయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఫిలిప్పిన్స్ అధ్యక్షుడి  చర్యతో అక్కడున్న వారంగతా నిశ్చేష్టులయ్యారు.  ఆ వెంటనే ఆయన కలగజేసుకున్నారు. ఇదంతా సరదా కోసమే చేశామని.. సీరియస్‌గా తీసుకోవద్దని అన్నారు. ఐతే ఇప్పుడు ఈ వ్యవహారంపై ఫిలిప్పిన్స్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. రొడ్రిగోపై మహిళా సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. సరదా కోసం వివాహిత మహిళను ఇబ్బంది పెట్టడమేంటని విమర్శిస్తున్నాయి. మరోవైపు ఆ ముద్దు సీన్‌ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో మనీలాకు చెందిన మీడియా సంస్థలు ఆ మహిళను ఇంటర్వ్యూ చేశాయి. ప్రధాని చర్యను ఆమె తేలిగ్గా తీసుకుంది. ఇది చాలా చిన్న వ్యవహారమని సరదా కోసమే ఇలా చేశామని తెలిపింది. తనకు, తన భర్తకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకని ఆమె ప్రశ్నించింది. కాగా, 73 ఏళ్ల రొడ్రిగో.. గతంలోనూ మహిళలపై పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా విద్వేషిగా ముద్రపడిన ఆయన.. మహిళలను కించపరుస్తూ చాలా సార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 6:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading