Home /News /international /

PHILIPPINES CYCLONE AT LEAST 75 DEAD IN PHILIPPINES SUPER TYPHOON RESCUE OPS CONTINUE SK

Philippines Typhoon: ఫిలిప్పిన్స్‌లో తుపాన్ బీభత్సం.. 75 మంది మృతి.. షాకింగ్ దృశ్యాలు

ఫిలిప్పిన్స్‌లో తుఫాన్ బీభత్సం (Image: Twitter)

ఫిలిప్పిన్స్‌లో తుఫాన్ బీభత్సం (Image: Twitter)

Philippines Rai Typhoon: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మిలిటరీ, కోస్ట్‌గార్డ్, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన భవన శిథిలాలు, నేలకొరిగిన చెట్లను తొలగిస్తున్నారు.

    ఫిలిప్పైన్స్‌ (Philippines)లో భీకర తుఫాన్‌ రయ్ (Typhoon Rai) బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షాలు, ప్రచండ ఈదురు గాలులతో అపార నష్టం వాటిల్లింది. చాలా చోట్ల ఇళ్లు కుప్పకూలిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలుల చిగురుటాకులా వణికాయి. తుఫాన్ ధాటికి ఇప్పటి వరకు 75 మంది మరణించారు. పలువురు గల్లంతవగా..మరికొందరు గాయపడ్డారు. దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారంత ఇళ్లను వదిలిపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుకు వెళ్లిపోయారు. భయంకరమైన తుఫాన్ ధాటికి విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. బాహ్య ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయని తెలిపారు.

    Lockdown: మళ్లీ లాక్‌డౌన్స్ షురూ..స్కూళ్లు సహా అన్నీ క్లోజ్..అక్కడ నేటి నుంచి కఠిన ఆంక్షలు

    చాల ద్వీపాలు ఛిన్నాభిన్నం అయ్యాయని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం తెలిపింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మిలిటరీ, కోస్ట్‌గార్డ్, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన భవన శిథిలాలు, నేలకొరిగిన చెట్లను తొలగిస్తున్నారు. ఇక వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. వారికి రేషన్ సరుకులు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాయి. గంటకు 195 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, కుండపోత వర్షాలు కురవడం వల్లే అపార నష్టం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

    ఫిలిప్పిన్స్‌లో తుఫాన్ బీభత్స దృశ్యాలు:









    దేశాధినేత సంచలన నిర్ణయం.. ఇకపై ఎవరూ నవ్వకూడదు, ఏడవకూడదు,

    కాగా, 2013లో సూపర్ టైపూన్ హయాన్ ఫిిలిప్పిన్స్‌ను తుడిచిపెట్టేసిన విషయం తెలిసిందే. ఆ తుఫాన్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఏకంగా 7,500 మరణించారు. వేలాది ఇళ్లు కూలిపోయాయి. చాలా మంది ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. ఆ విధ్వంసాన్ని మరవక ముందే ఇప్పుడు రయ్ తుఫాన్ మరోసారి విరుచుకుపడింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cyclone, Philippine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు