వివాదంలో స్టార్‌బక్స్ కాఫీ...చిన్న పొరపాటుతో కోర్టు మెట్లెక్కనున్న కస్టమర్...

ముగ్గురు కాఫీ తాగి అక్కడి నుంచి బయటపడ్డారు. కాస్త దూరం వెళ్లిన తర్వాత జాన్సన్ స్నేహితుల్లో ఒకరు, స్టార్ బక్స్ కాఫీ షాప్ బిల్లు చూశాడు.

news18-telugu
Updated: August 31, 2019, 7:29 PM IST
వివాదంలో స్టార్‌బక్స్ కాఫీ...చిన్న పొరపాటుతో కోర్టు మెట్లెక్కనున్న కస్టమర్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రపంచ ప్రఖ్యాత కాఫీషాప్ దిగ్గజం స్టార్ బక్స్ ఓ కస్టమర్ చేసిన ఫిర్యాదుతో చిక్కుల్లో పడింది. కాఫీ షాప్ లో పనిచేసే హెల్పర్ చేసిన చిన్న పొరపాటు, స్టార్ బక్స్ ప్రతిష్టను మసకబార్చేంత పెద్ద వివాదంగా రూపు దాల్చుకుంది. వివరాల్లోకి వెళితే ఫిలడేల్ఫియాకు చెందిన నికెల్ జాన్సన్ తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న స్టార్ బక్స్ కాఫీషాప్ వెళ్లాడు. అక్కడే మూడు కాఫీలు ఆర్డర్ చేశాడు. ఆర్డర్ తీసుకున్న తర్వాత స్టార్‌బక్స్ ఉద్యోగిని యధావిధిగా బిల్ పై కస్టమర్ పేరు ముద్రించడం కోసం జాన్సన్ పేరు అడిగింది. అయితే జాన్సన్ తన ముద్దు పేరు అజీజ్ అని బిల్ పై ముద్రించాలని కోరాడు. ముగ్గురు కాఫీ తాగి అక్కడి నుంచి బయటపడ్డారు. కాస్త దూరం వెళ్లిన తర్వాత జాన్సన్ స్నేహితుల్లో ఒకరు, స్టార్ బక్స్ కాఫీ షాప్ బిల్లు చూశాడు. అయితే దానిపై జాన్సన్ చెప్పిన అజీజ్ పేరు బదులు ఐసీస్ అని రాసి ఉండటంతో ఒక్కసారిగా షాక్ కు గురై, జాన్సన్ ఆటపట్టించేందుకు బిల్లును చూపించాడు.

అయితే జాన్సన్ ఒక్కసారిగా మండిపడ్డాడు. తాను చెప్పిన అజీజ్ పేరుకు బదులు భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఐసీస్ అని బిల్లుపై ఎలా ముద్రిస్తారని స్టార్ బక్స్ యాజమాన్యంతో గొడవకు దిగాడు. ఈ మెయిల్ ద్వారా స్టార్ బక్స్ సీఈవోకు ఫిర్యాదు చేశాడు. అయితే జరిగిన పొరపాటుపై స్టార్ బక్స్ చింతిస్తూ క్షమాపణలు కోరింది. అయితే జాన్సన్ మాత్రం తనకు క్షమాపణలు సరిపోవని, న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని పేర్కొన్నాడు.

First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు