ఎన్నికల వేళ మోదీని భయపెడుతున్న అసలు సమస్య ఇదే....

నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రస్తుతం ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71 డాలర్లను తాకింది. అయితే ఈ ఎఫెక్ట్ పెట్రోల్, డీజెల్‌పై ప్రత్యక్షంగా పడే ప్రభావం ఉంది. కాగా ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రజల్లో నెగిటివ్ ఫ్యాక్టర్ వెళ్లే ప్రమాదం ఉందని అధికార పార్టీ అంచనా వస్తోంది.

  • Share this:
    అంతర్జాతీయంగా చమురుధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఒపెక్ దేశాలు క్రూడ్ ఉత్పత్తిని ఇప్పటికే 30 శాతం తగ్గించడంతో ముడిచమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా ఐదు నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71 డాలర్లను తాకింది. అయితే ఈ ఎఫెక్ట్ పెట్రోల్, డీజెల్‌పై ప్రత్యక్షంగా పడే ప్రభావం ఉంది. కాగా ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రజల్లో నెగిటివ్ ఫ్యాక్టర్ వెళ్లే ప్రమాదం ఉందని అధికార పార్టీ అంచనా వస్తోంది. అయితే అంతర్జాతీయంగా ఎస్కలేట్ అవుతున్న క్రూడ్ ధరల ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎప్పుడు ప్రభావం చూపుతుందనేది, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల చేతుల్లో ఉంది. గత యూపీఎ ప్రభుత్వం సైతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయకలేకపోవడంతో చివర్లో చేతులేత్తేసింది. దీంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే ప్రస్తుతం మోదీ సర్కారును సైతం పెట్రోధరలు వణికిస్తున్నాయనే చెప్పవచ్చు.

    అయితే ఇరాన్, వెనుజులాపై అమెరికా విధించిన ఆంక్షలు సైతం క్రూడ్ ధరల పెరుగుదలకు దోహదమవుతున్నాయి. అలాగే లిబియాలో సంక్షోభం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాగా గడిచిన మూడేళ్లుగా క్రూడ్ ధరలు భారీ పతనం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం రష్యా మాత్రం క్రూడ్ ఉత్పత్తిని జూన్ నుంచి పెంచేందుకు సిద్ధంగా ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా ఉన్న ఈ దశలో అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తోంది.

    ఇదిలా ఉంటే గత సెప్టెంబర్ లో మనదేశంలో పెట్రోల్ ధర రూ.90 సమీపం దాకా వస్తే, డీజిల్ ధర రూ.80 దాకా పెరిగింది. ఆ సమయంలో మోదీ సర్కారుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అనంతరం తగ్గిన క్రూడ్ ధరలతో మళ్లీ సాధారణ స్థితికి పెట్రోల్, డీజెల్ ధరలు దిగి వచ్చాయి. అయితే రానున్న నెల రోజుల పాటు దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం 7దశల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజెల్ ధరల పెరుగుదల ప్రభావం ఎన్నికలపై ఎలా చూపనుంది అనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొంది.
    First published: