Home /News /international /

PETROL AT CHEAP PRICE ARMY SECURITY AT PETROL BUNKS IN ZIMBABWE

తక్కువ ధరకే పెట్రోల్...దొరక్క జనం అవస్థలు...బంక్‌ల వద్ద ఆర్మీ బలగాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎప్పుడు పెట్రోల్ దొరుకుతుందో తెలియకపోవడంతో...వాహనాలను రోజుల తరబడి బంకుల వద్దే ఉంచుతున్నారు. సుమారు ఐదార్లు కిలోమీటర్ల మేర లైన్ కడుతున్నాయనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

  భారత్‌లో పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మన దగ్గర ఒక్క రోజు పెట్రో ధరలు తగ్గితే.. రెండు రోజుల పాటు పెరుగుతాయి. ఓ దశలో రూ.100 దిశగా పెట్రోల్ ధర పరుగులు తీసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల కొంత మేర తగ్గముఖం పడుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఐతే జింబాబ్వేలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. పెట్రోల్ రేట్లు భారీగా పడిపోయినా... కొందామంటే ఇంధనం దొరకడం లేదు. ఏ బంక్ దగ్గర చూసినా కిలోమీటర్ల మేర క్యూ లైన్ కనబడుతోంది. ఎందుకీ పరిస్థితి..?

  జింబాబ్వేలో తక్కువ ధరకే పెట్రోల్ దొరుకుతుండడంతో..పక్కదేశాల వ్యాాపారులు ఎగబడుతున్నారు. ట్యాంకర్లకు ట్యాంకర్లు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి స్వదేశానికి వెళ్లి అమ్ముకుంటున్నారు. ఫలితంగా జింబాబ్వేలో కృత్రిమ కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ దొరక్క అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఎప్పుడు పెట్రోల్ దొరుకుతుందో తెలియకపోవడంతో...వాహనాలను రోజుల తరబడి బంకుల వద్దే ఉంచుతున్నారు. సుమారు ఐదార్లు కిలోమీటర్ల మేర లైన్ కడుతున్నాయనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

  పెట్రోల్ బంకుల వద్ద రద్దీ జాతరను తలపిస్తుండడంతో..కొత్త వ్యాపారాలు పుట్టుకొచ్చాయి. పెట్రోల్ కొనుగోలు చేసేందుకు క్యూలైన్లలో నిల్చున్న వారి కోసం ఆహారపదార్థాలు, నీళ్లు అందిస్తున్నారు చిరు వ్యాపారులు. కొన్నిచోట్ల పెట్రోల్ బంకుల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇతర దేశాల వ్యాపారులకు ఇంధనాన్ని అమ్మవద్దని జింబాబ్వే పౌరులు గొడవ పెట్టుకుంటున్నారు. బంక్ యజమానులపై దాడులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెట్రోల్ బంకుల వద్ద ఆర్మీని మోహరించారు. ఇక ఇంధన కొరతతో జింబాబ్వేలోని పలు నగరాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దాంతో స్కూళ్లు, ఆఫీసులు మూతపడే దారుణ పరిస్థితులు తలెత్తాయి.

  First published:

  Tags: Fuel prices, Petrol prices, Zimbabwe

  తదుపరి వార్తలు