Home /News /international /

PETROL AND DIESEL RESERVES IN SRI LANKA IS ALMOST BECOME DRY MORE CRISIS IN COUNTRY AK

పాపం శ్రీలంక.. ఏంటి దుస్థితి.. మరింత సంక్షోభం.. అడుగంటిన పెట్రోల్, డీజిల్ నిల్వలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sri Lanka Crisis: అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే దీనికి ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపింది.

    ప్రస్తుతం శ్రీలంక భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని (Financial Crisis) ఎదుర్కొంటోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడింది.. దీంతో లక్షలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అంతే కాదు పెట్రోల్(Petrol) నిల్వలు కూడా ముగిసిపోయే దశకు చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్ సరఫరా తక్కువగా ఉండటంతో ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద పొడవైన లైన్లు కనిపిస్తున్నాయి. కొంతకాలం నుంచి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో(Sri Lanka) విదేశీ మారక నిల్వలు పూర్తిగా అయిపోయాయి. పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల దిగుమతులకు కూడా ఆ దేశం దగ్గర డబ్బు లేదు. ఈ విషయాన్ని శ్రీలంక రవాణా శాఖ మంత్రి దిలామ్ అమునుగమా ధృవీకరించారు. అత్యవసర సర్వీసుల వాహనాలను నడపడానికి ప్రస్తుతం గ్యారేజీలో పార్క్ చేసిన ప్రభుత్వ వాహనాల నుంచి డీజిల్ తీసి పనులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

    దేశంలోని రవాణా సేవల్లో మూడింట రెండు వంతుల వాటా ప్రైవేట్ వాహనాలదే అని.. ఈ ప్రైవేట్ బస్సుల సంస్థ అధిపతి గెమును విజయరత్న తెలిపారు. తాము ప్రస్తుతం పాత డీజిల్ స్టాక్‌తో కొన్ని అవసరమైన వాహనాలను నడుపుతున్నామని అన్నారు. కానీ శుక్రవారం నాటికి సరఫరా జరగకపోతే వాటి రవాణా కూడా నిలిచిపోతుందని తెలిపారు. మరోవైపు డీజిల్ అయిపోయిన కారణంగా ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణ కూడా ప్రభావితమైంది. జనరేటర్ పనిచేయడం లేదు. దీంతో 13-13 గంటల పాటు విద్యుత్‌ కోత ఉంటుంది.

    ఈ విషయమై సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్, MMC ఫెర్డినాండో స్పందించారు. రెండు రోజుల్లో కొత్త సరఫరా ప్రారంభమవుతుందని తమకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇది సాధ్యమైతే, తాము విద్యుత్ కోత కాలాన్ని తగ్గించగలమని అన్నారు. పవర్ కట్ కారణంగా కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా పనిచేయడం లేదు. అక్కడ 4 గంటలకు బదులు 2 గంటలు మాత్రమే పనులు జరుగుతున్నాయి.

    Countries With No Airports: ప్రపంచంలోని విమానాశ్రయం లేని దేశాలు ఇవే.. మరి ఇక్కడికి వెళ్లాలంటే ఎలా ?

    Pakistan Army: బేకరీ నుంచి బ్యాంక్‌ల వరకు ఎన్నో వ్యాపారాలు.. వేల కోట్ల బ్లాక్ మనీ.. పాక్ ఆర్మీ గురించి ఆసక్తికర విషయాలు

    అవసరం లేని సిబ్బంది ఇంట్లోనే ఉండాలని కోరారు. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. అవసరమైన మందులు కూడా అయిపోయాయి. ఆసుపత్రుల ఇతర సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. టీవీలు, ఫోన్లు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే దీనికి ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపింది. ఇది కాకుండా భారతదేశం, చైనా నుండి మరింత రుణ-సహాయం పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Sri Lanka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు