హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

PETA: మాంసాహారం తినే పురుషులతో శృంగారం చేయకండి.. మహిళలను కోరుతున్న సంస్థ.. కారణం ఇదే..

PETA: మాంసాహారం తినే పురుషులతో శృంగారం చేయకండి.. మహిళలను కోరుతున్న సంస్థ.. కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PETA: నాన్‌వెజ్ ఎక్కువగా తినే మేల్ పార్ట్నర్‌తో శృంగారం విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టి వారిని దగ్గరికి రానివ్వద్దని మహిళలను కోరుతోంది పెటా.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మాంసం (Meat) ఎక్కువగా తినే వారి కారణంగా పర్యావరణానికి హాని జరుగుతోందని చెబుతోంది జంతువుల హక్కుల సంఘం పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA). ఇలాంటి వారు శాకాహారులు (Vegans)గా మారడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పురుషులు (Men) ఎక్కువగా మాంసం తింటున్నారని, వారిని శాకాహారులుగా మార్చేందుకు స్త్రీలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. నాన్‌వెజ్ ఎక్కువగా తినే మేల్ పార్ట్నర్‌తో శృంగారం విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టి సెక్స్‌ స్ట్రైక్‌ (Strike) పాటించాలని, తద్వారా వారిని వెజిటేరియన్స్‌గా మార్చాలని పిలుపునిచ్చింది.

దీనికి పిలుపునిస్తూ PETA ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా Plos One అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఫలితాలను పెటా వివరించింది. ది సైన్స్‌ స్పీక్స్‌ ఫర్‌ ఇట్‌ సెల్ఫ్‌ పేరిట ఈ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. వాతావరణ విపత్తుకు స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా దోహదపడుతున్నారని ఈ రిపోర్ట్ తెలిపింది. పురుషులు ఎక్కువగా మాంసాహారం తింటున్నారని, వారి ఆహారపు అలవాట్లు 41 శాతం ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయువులకు కారణమవుతున్నాయని పేర్కొంది.

సబర్బన్ పురుషులు సాసేజ్‌లను తింటూ, బీర్లు లాగిస్తున్నారని పెటా తెలిపింది. వీరు నాన్‌వెబ్ బార్బెక్యూ తీసుకుంటూ తమ మగతనాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారని, తద్వారా జంతువులతో పాటు గ్రహానికి కూడా హాని చేస్తున్నారని పేర్కొంది.

* అందుకే స్ట్రైక్‌?

పురుషులు తమ చర్యలకు జవాబుదారీతనం వహించాలని PETA తెలిపింది. అందుకే మాంసం తినే పురుషులపై శృంగార స్ట్రైక్‌ను ప్రతిపాదిస్తున్నామని పేర్కొంది. మహిళలు వారిని శృంగారానికి దూరం పెట్టి, శాకాహారులుగా మార్చాలని తెలిపింది. మాంసాహార వినియోగ ప్రభావం వాతావరణంపై ఎక్కువగా ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని, దీని నిర్మూలనకు సులభమైన, ఆరోగ్యకరమైన, సులభమైన మార్గం శాకాహారానికి మారడమని PETA వివరించింది.

ఇది కూడా చదవండి : పెరిగిన హిమాలయన్‌ వయాగ్రా లభ్యత.. కిలో రూ.12 లక్షలు.. ప్రత్యేకతలివే..

* యూకేలో 17 శాతం తగ్గుదల

జర్మనీలో PETA క్యాంపెయిన్ మెంబర్ డాక్టర్ కారిస్ బెన్నెట్ టైమ్స్ రేడియోతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. పురుషులు స్త్రీల కంటే ఎక్కువ నాన్‌వెజ్ తింటూ 40 శాతం ఎక్కువ కార్బన్‌ ఎమిషన్‌కు కారణమవుతున్నారని తెలిపారు. అందుకే పురుషులు వారి చర్యలకు బాధ్యత వహించాలన్నారు. గత 10 సంవత్సరాలలో UKలో మాంసం తినడం 17 శాతం తగ్గిందని, కానీ అది సరిపోదని చెప్పారు.

ఇప్పటికీ మాంసాహారం కోసం ప్రతి సంవత్సరం ఒక బిలియన్ కోళ్లు, ఆవులు, పందులను చంపుతున్నారని వివరించారు. భూమిపై, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు వెజిటేరియన్ డైట్‌ ఫాలో అవ్వాలని డాక్టర్ కారిస్ బెన్నెట్ పిలుపునిచ్చారు. మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వాతావరణం, అటవీ నిర్మూలన, మహమ్మారి, కాలుష్యం, అనేక పర్యావరణ నష్టాలకు చెక్ పెట్టొచ్చని తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: International news, Meat, Trending, VIRAL NEWS

ఉత్తమ కథలు