news18-telugu
Updated: November 24, 2020, 1:57 PM IST
పెంపుడు జంతువుల కొంటె పనులను పంచుకోవడానికి ఫేస్బుక్లో ఒక గ్రూప్ ఉంది తెలుసా? (credit -facebook)
ఇంటర్నెట్లో పెంపుడు జంతువులు చేసే పనులను ఫోటోలు, వీడియోలు తీసి పంచుకునే ధోరణి పెరుగుతోంది. ఫేస్బుక్లో పెట్ షేమింగ్ వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారుతున్నాయి. తమ పెంపుడు జంతువులు ప్రత్యేకంగా, అలవాట్లకు విరుద్ధంగా చేసే పనులను యజమానులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అప్పుడు వాటి హావభావాలను ఫోటోలు, వీడియోలు తీస్తారు. ఇలాంటివి పంచుకోవడానికి ఫేస్బుక్లో ప్రత్యేకంగా ఒక పేజీ కూడా ఉండటం విశేషం. పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య బంధం బలపడటం కోసం ఇలాంటి ఫన్నీ ఫోటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. ఫేస్బుక్లో ‘పెట్ షేమింగ్’ అనే గ్రూప్ ఉంది. దీంట్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెంపుడు జంతువుల యజమానులు చేరవచ్చు. అవి చేసే కొంటె పనులను ఈ ఎఫ్బీ గ్రూప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులతో పంచుకోవచ్చు. ఈ గ్రూప్‌లో 1,02,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. పెంపుడు జంతువుల యజమానులతో పాటు ఇతరులు కూడా దీంట్లో చేరవచ్చు. అవి చేసే సందడిని తోటి మిత్రులతో పంచుకోవచ్చు. ఈ గ్రూప్‌లో ఫేస్బుక్ యూజర్లు పంచుకున్న కొన్ని పెట్ షేమింగ్ సందర్భాలు...
* ఒక పిల్లి ఆహారం తినడానికి నిరాకరించినటప్పుడు తీసిన వీడియోకు యూజర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. దాని యజమాని పెట్ షేమింగ్ గ్రూప్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. “అనారోగ్య కారణాల వల్ల టెడ్ (పిల్లి పేరు)కు ఒక ఆపరేషన్ చేయించాం. దాని సంరక్షణ కోసం ఒక ఈ-కాలర్ (మెడ చుట్టూ పెట్టే పట్టీ)ను పెట్టాం. అప్పటి నుంచి అది ఏమీ తినట్లేదు. ఇప్పుడు దానికి బ్రెడ్‌ను అందిస్తున్నాం. సాంప్రదాయ ఈ-కాలర్‌ను ధరించడానికి నిరాకరించినందుకు టెడ్‌ను షేమింగ్ చేయండి” అని పోస్ట్ చేశారు. దీనికి ఎంతోమంది పెంపుడు జంతువుల యజమానులు హాస్యాస్పదంగా కామెంట్లు పెడుతున్నారు.

"నా పేరు బోర్బన్. నేను నా మలాన్ని తింటాను" (credit - facebook)
* "నా పేరు బోర్బన్. నేను నా మలాన్ని తింటాను" అనే టైటిల్‌తో మరో పోస్ట్ ఉంది. బోర్బన్ అనే కుక్కకు ఇలాంటి అసహ్యకరమైన అలవాటు ఉంది. కానీ అలా చేసేటప్పుడు ఎవరూ చూడకుండా ఆ కుక్క జాగ్రత్త పడుతుంది. దీన్ని గుర్తించిన యజమాని కుక్క అలవాట్ల గురించి షేమింగ్ చేయాలని గ్రూప్‌లో పోస్ట్ పెట్టాడు. "నన్ను షేమింగ్ చేయండి" అని కుక్క ఫోటోతో పాటు పెట్టిన పోస్టుకు ఎంతోమంది స్పందించారు.
* 19 వారాల వయసున్న గ్రేట్ డేన్ జాతి కుక్కపిల్లకు సంబంధించిన మరో పోస్టు వైరల్ అవుతోంది. దాని పేరు జార్జ్. అది చిన్నప్పటి నుంచి తన తోటి కుక్కపిల్లకు కేటాయించిన బెడ్‌పైనే పడుకుంటోంది. దీంతో దాని తల్లి, జార్జ్‌ను కనిపెట్టలేక ఇబ్బందులు పడుతోంది. దాని అలవాట్లను షేమింగ్ చేయమని జార్జ్ యజమాని గ్రూప్‌లో పోస్టు పెట్టాడు.

గడ్డి నిల్వ చేసే కేజ్ లోపలికి ఆ ఆవు ఎలా వెళ్లింది (credit - facebook)
* కుక్కలు, పిల్లులు మాత్రమే కాకుండా ఇతర జంతువులకు సంబంధించిన విషయాలను కూడా యజమానులు గ్రూప్‌లో పంచుకుంటున్నారు. ఒక ఆవు గురించి దాని యజమాని గ్రూపులో ఒక పోస్టు పెట్టాడు. గడ్డి నిల్వ చేసే కేజ్ లోపలికి ఆ ఆవు ఎలాగో వెళ్లింది. దాన్ని బయటకు తీసుకురావడానికి ఆ కేజ్‌ను పూర్తిగా పైకి ఎత్తాల్సి వచ్చిందట. అది లోపలికి ఎలా వెళ్లిందో అంతుపట్టట్లేదని, అది చేసిన పనికి షేమింగ్ చేయాలని దాని యజమాని గ్రూప్‌లో పెట్టిన పోస్టులో కోరాడు.
ఇది కూాడా చదవండి: Belly Fat: పొట్ట పెరుగుతోందా... అరటిపండును ఇలా తినండి... కచ్చితంగా తగ్గిపోతుంది
ఇలాంటి ఎన్నో పోస్టులు గ్రూప్‌లో సందడి చేస్తున్నాయి. మీకు కూడా కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు ఉంటే, అవి చేసే కొంటె పనులను ఈ ఫేస్బుక్ గ్రూప్‌లో పంచుకోండి మరి.
Published by:
Krishna Kumar N
First published:
November 24, 2020, 1:57 PM IST